India's billionaire: చరిత్రలో తొలిసారి.. 300 దాటిన భారత బిలియనీర్ల సంఖ్య!

భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024' ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది. 13 ఏళ్లలో భారతదేశ సంపద గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను మించిపోగా ఆరు రెట్లు పెరిగినట్లు సదరు సంస్థ వెల్లడించింది.

India's billionaire: చరిత్రలో తొలిసారి.. 300 దాటిన భారత బిలియనీర్ల సంఖ్య!
New Update

India's billionaires: భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. ఇటీవల 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024' విడుదల చేసిన లిస్ట్ ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది. 13 ఏళ్లలో భారతదేశ సంపద వృద్ధి గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను మించిపోగా ఆరు రెట్లు పెరిగినట్లు సదరు సంస్థ వెల్లడించింది.

అలాగే దేశంలో దాదాపు 1,500 మందికి పైగా ₹1,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారని పేర్కొంది. గత ఏడు సంవత్సరాల్లో 150% సంపద పెరగగా ఇండియా మొత్తంలో 1,539 మంది అతి సంపన్నలున్నారు. గత సంవత్సరం 220 ఉండగా రికార్డు స్థాయిలో ఈ యేడాది 272 మంది కొత్తగా సంపన్నులయ్యారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లోని వ్యక్తుల సంపద ఇప్పుడు ₹159 లక్షల కోట్లకు చేరుకుంది. వీరి సంపద సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌ల GDPని అధిగమించి భారతదేశ GDPలో సగానికి పైగా ఉండటం విశేషం. కాగా 1,334 మంది వ్యక్తులు వివిధ మార్గాల్లో తమ సంపదను పెంచుకోగా 29 పరిశ్రమలు, 42 నగరాల నుండి 272 మంది బిలియనీర్ల జాబితాలో కొత్తగా చేరారు.

బిలియనీర్ క్లబ్‌లోకి షారూఖ్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ 58 స్థానంలో నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో తన వాటాతో ₹7,300 కోట్ల సంపాదించి హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చోటు సంపాదించాడు. చిత్ర పరిశ్రమ నుంచి జూహీ చావ్లా, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, అమితాబ్ బచ్చన్ ఈ లిస్ట్ లో ఉన్నారు. మొదటిసారి బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. 17 మంది కొత్తవారితో ముంబై (386), న్యూఢిల్లీ (217) రెండు స్థానాల్లో నిలవగా 104 మందితో హైదరాబాద్ మూడో స్థానానికి చేరుకుంది.

సంపద సృష్టిలో తయారీ రంగం ముందంజ..
ఇక సంపద సృష్టిలో తయారీ రంగం ముందుంది. భారతదేశ తయారీ రంగం బలమైన వృద్ధిని కనబరిచింది. ఈ సంవత్సరం 1,016 తయారీ రంగ వ్యవస్థాపకులు తమ సంపదకు అదనంగా ₹28 లక్షల కోట్లను అందించారు. పారిశ్రామిక ఉత్పత్తుల రంగం 142 మంది వ్యక్తులతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత ఫార్మాస్యూటికల్స్ (136), కెమికల్స్ & పెట్రోకెమికల్స్ (127) ఉన్నాయి. ఇక నేహా బన్సల్ 42, లెన్స్‌కార్ట్ సహ వ్యవస్థాపకురాలు జోహోకు చెందిన రాధా వెంబు ఈ జాబితాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారని ఈ సర్వే పేర్కొంది.

అలాగే US$5 బిలియన్ల విలువైన శీఘ్ర-కామర్స్ స్టార్టప్ Zeptoకి చెందిన 21 ఏళ్ల కైవల్య వోహ్రా ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచారు. 22 ఏళ్ల ఆదిత్ పాలిచా రెండవ అతి పిన్న వయస్కుడు. రేజర్‌పే సహ వ్యవస్థాపకులు యువ బిలియనీర్లు హర్షిల్ మాథుర్, శశాంక్ కుమార్ 33 ఏళ్ల వయసులోనే బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించారు.

#hurun-rich-list-2024 #india-billionaires #crossed-300
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe