Asia cup: ఆసియాకప్‌లో భారత్ శుభారంభం.. 7 వికెట్ల తేడాతో పాక్ చిత్తు!

ఆసియా కప్ 2024 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Asia cup: ఆసియాకప్‌లో భారత్ శుభారంభం.. 7 వికెట్ల తేడాతో పాక్ చిత్తు!
New Update

Asia cup: ఆసియా కప్ 2024 టోర్నీలో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన గ్రూప్‌-ఏ తొలి మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్థాన్‌ 19.2 ఓవర్లకు 108 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. అనంతరం 109 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ఓపెనర్లు షెఫాలీవర్మ (40; 29 బంతుల్లో 6×4, 1×6), స్మృతి మంధాన (45; 31 బంతుల్లో 9×4)పరుగులు చేసి భారత్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్‌ 25, టుబా హసన్‌ 22, ఫాతిమా సనా 22 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు మమాత్రపు స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, పూజా వస్త్రాకర్‌, శ్రేయంకా పాటిల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. పాక్‌ బౌలర్లలో అరూబ్‌ షా 2 వికెట్లు పడగొట్టగా.. నష్రా సంధు ఒక వికెట్‌ దక్కించుకుంది.

#india-beat-pakistan-by-7-wickets #asia-cup
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe