Independence Day: భారత్ లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఉగ్ర దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్ర సంస్థకు చెందిన కొందరు ఢిల్లీ, పంజాబ్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. భద్రతా బలగాల భారీ మోహరింపు కారణంగా ఆగష్టు 15న ఈ దాడులు జరగకపోవచ్చును కూడా, కానీ ఒకటి లేదా రెండు రోజుల తర్వాత ఈ దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
జమ్మూ కశ్మీర్ లోని కథువా సరిహద్దు గ్రామంలో ఇటీవల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కదలికలు, ఆయుధాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. "జూన్ 1న, పేలుడు పదార్థాలు/ఐఈడీల సరుకు జమ్మూ నగరంలోని లోతట్టు ప్రాంతాలకు చేరుకుంది. ఈ పేలుడు పదార్థాలు రాబోయే రోజుల్లో భద్రతా సంస్థలు, శిబిరాలు, వాహనాలు లేదా కీలకమైన ఇన్‌స్టాలేషన్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోస్తారని" ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, జమ్మూ కశ్మీర్ పరిసర ప్రాంతాలలో చురుకుగా ఉన్న గ్యాంగ్‌స్టర్లు, రాడికల్స్, టెర్రరిస్టుల ప్రాయోజిత అనుబంధం స్వాతంత్య్ర దినోత్సవం, కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించడానికి ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు.
"కతువా, దోడా, ఉధంపూర్, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు జమ్మూ ప్రాంతంలో సాయుధ ఉగ్రవాద గ్రూపుల ఉనికిని సూచిస్తున్నాయి. ఉన్నత స్థాయి ప్రముఖులు, స్థాపనలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకర కార్యకలాపాలను నిర్వహించేందుకు ఈ సంస్థల ఉద్దేశమని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ప్రణాళికలను ఇన్‌పుట్‌లు సూచిస్తున్నాయి.
Also Read: