Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఎర్రకోటపై తిరువర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అసంఖ్యాక ‘స్వాతంత్య్ర ప్రేమికులకు’ నివాళులు అర్పించే రోజు ఈ రోజు. వారందిరికీ ఈ దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారిని, జీవితాంతం పోరాడిన వారిని, ఉరికి ఎక్కి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసిన వారిని మనం స్మరించుకునే సమయం ఇది ప్రధాని మోదీ అన్నారు. అమర వీరులందరికీ సెల్యూట్ చేస్తున్నాను అంటూ చెప్పారు.
పూర్తిగా చదవండి..Independence Day 2024: మువ్వన్నెల జెండా రెపరెపలు.. ప్రధాని ప్రసంగంలో వికసిత్ భారత్ ఆకాంక్షలు!
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోట పై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ దూసుకుపోతోందని చెప్పారు. భారత ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తి అని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు దేశం రుణపడి ఉంటుందన్నారు
Translate this News: