Independence Day 2024: మువ్వన్నెల జెండా రెపరెపలు.. ప్రధాని ప్రసంగంలో వికసిత్ భారత్ ఆకాంక్షలు! స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోట పై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వికసిత్ భారత్ 2047 దిశగా భారత్ దూసుకుపోతోందని చెప్పారు. భారత ప్రస్థానం ప్రపంచానికి స్ఫూర్తి అని తెలిపారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు దేశం రుణపడి ఉంటుందన్నారు By KVD Varma 15 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఎర్రకోటపై తిరువర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అసంఖ్యాక 'స్వాతంత్య్ర ప్రేమికులకు' నివాళులు అర్పించే రోజు ఈ రోజు. వారందిరికీ ఈ దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారిని, దేశ స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారిని, జీవితాంతం పోరాడిన వారిని, ఉరికి ఎక్కి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేసిన వారిని మనం స్మరించుకునే సమయం ఇది ప్రధాని మోదీ అన్నారు. అమర వీరులందరికీ సెల్యూట్ చేస్తున్నాను అంటూ చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. Independence Day 2024: ఈ ఏడాది, గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా మన ఆందోళనలు పెరుగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “ప్రకృతి విపత్తులో చాలా మంది తమ కుటుంబ సభ్యులను, ఆస్తులను కోల్పోయారు. దేశం కూడా నష్టపోయింది. ఈ రోజు, నేను వారందరికీ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో ఈ దేశం వారికి అండగా ఉంటుందని నేను వారికి హామీ ఇస్తున్నాను.” అని ప్రధాని చెప్పారు. “భారతదేశం నుండి వలస పాలనను నిర్మూలించిన 40 కోట్ల మంది ప్రజల రక్తం మనకు అండగా ఉందని మేము గర్విస్తున్నాము... మనం ఒక దిశలో కలిసి ముందుకు సాగితే నేడు 140 కోట్ల మంది ప్రజలందరం కలిసి మనం ఎదుగుతాం, అప్పుడే మనకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను అధిగమించి 2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశం'గా మారగలం.” అని పిలుపునిచ్చారు. Independence Day 2024: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందడం చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. “గతంలో కనీస అవసరాలు తీరకుండా దళితులు, గిరిజనులు జీవించేవారు. వీటి కోసం ప్రయత్నాలు చేశాం, ఫలితాలు అందరి ముందు ఉన్నాయి. నేడు ప్రతి జిల్లా ఉత్పత్తులను తయారు చేయడం సంతోషకరం. ఈ రోజు ప్రపంచం మొత్తం భారతదేశం నుండి ఏదో ఒకటి నేర్చుకుంటుంది. కరోనా కాలంలో కోట్లాది మందికి వ్యాక్సినేషన్ ఇచ్చాం. మన దేశ సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఆ దేశం గుండెల్లో గుబులు పుడుతుంది. మన సైన్యం మనకు గర్వకారణం” అంటూ ప్రధాని చెప్పారు. Independence Day 2024: దేశ రక్షణ కోసం పూర్తి అంకితభావంతో, నిబద్ధతతో దేశాన్ని పరిరక్షిస్తున్న గొప్ప వ్యక్తులు నేడు దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. “వారు మన రైతులు, మన సైనికులు, మన యువత ధైర్యం, మన తల్లులు అలాగే సోదరీమణులు, దళితులు, దోపిడీకి గురైన, అణగారిన వారి సహకారం, కష్టాల మధ్య స్వాతంత్య్రం పట్ల వారి అంకితభావం, ప్రజాస్వామ్యం పట్ల వారి అంకితభావం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమైన సంఘటన. స్వాతంత్య్రానికి ముందు రోజులను గుర్తు చేసుకోండి. వందల సంవత్సరాల బానిసత్వం, దాని విముక్తి కోసం పోరాటం. యువత, రైతులు, మహిళలు లేదా గిరిజనులు కావచ్చు... వారు బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. 1857 నాటి స్వాతంత్ర పోరాటానికి ముందు కూడా మన దేశంలో అనేక గిరిజన ప్రాంతాలు ఉండేవని, ఇక్కడ స్వాతంత్య్రం కోసం యుద్ధం జరిగిందని చరిత్ర సాక్ష్యం చెప్పింది. ఈ వార్త అప్ డేట్ అవుతోంది.. #modi #independence-day-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి