Ind Vs Sri: శ్రీలంక టూర్‌లో పాండ్యకు మొండిచెయి.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!

శ్రీలంక పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న భారత తుది జట్లను బీసీసీఐ ప్రకటించింది. వన్డేలకు రోహిత్‌ శర్మ అందుబాటులోకి రాగా టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ ను కెప్టెన్ గా నియమించారు. జులై 27, 28, 30 టీ20లు, ఆగస్టు 2, 4, 7 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

New Update
Ind Vs Sri: శ్రీలంక టూర్‌లో పాండ్యకు మొండిచెయి.. జట్టును ప్రకటించిన బీసీసీఐ!

Ind Vs Sri: శ్రీలంక పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనున్న భారత తుది జట్లను బీసీసీఐ ప్రకటించింది. హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో 30 మందిని సెలక్ట్ చేయగా.. వన్డేలకు రోహిత్‌ శర్మ అందుబాటులోకి రాగా టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ ను కెప్టెన్ గా నియమించారు. ఇటీవల జింబాబాబ్వేతో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్‌ ను ఈ టూర్‌లో రెండు సిరీస్‌లకు వైస్‌ కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు.

ఇక పల్లెకెలె వేదికగా శ్రీలంకతో భారత్‌.. జులై 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు, కొలంబోలో ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్న సూర్యకుమార్‌ యాదవ్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. టీ20లు ఆడనున్న హార్దిక్ పాండ్యా.. వ్యక్తిగత కారణాల రిత్యా వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. కోచ్‌ గంభీర్‌ రిక్వెస్ట్ తో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ఆడేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌తో మళ్లీ జట్టులో చేరనున్నాడు. యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, హర్షిత్ రాణాలకు తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యారు.

టీ20 టీమ్:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్‌ సిరాజ్‌.

వన్డే టీమ్:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్‌ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

Advertisment
తాజా కథనాలు