Ind vs Sl 2023: కేకపుట్టిన టీమిండియా బౌలర్స్.. 3 పరుగులకే శ్రీలంక 4 వికెట్లు డౌన్..

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బౌలర్స్ దుమ్మురేపుతున్నారు. సిరాజ్, బుమ్రా దెబ్బకు శ్రీలంక బ్యాటర్స్ వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. కేవలం 3 పరుగులకే 4 వికెట్లు సమర్పించుకున్నారు.

New Update
Ind vs Sl 2023: కేకపుట్టిన టీమిండియా బౌలర్స్.. 3 పరుగులకే శ్రీలంక 4 వికెట్లు డౌన్..

Ind vs Sl ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య నేడు మ్యాచ్ జరుగుతోంది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత భౌలర్లు దడ పుట్టిస్తున్నారు. ఇన్నింగ్స్ మొదలైన మొదటి బంతికే శ్రీలంక బ్యాట్స్‌మెన్ వికెట్ సమర్పించుకున్నారు. ఆ మరుసటి ఓవర్‌లో కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది శ్రీలంక. మొదటి ఓవర్ వేసిన బుమ్రా ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఒక వికెట్ తీసి మ్యాజిక్ చేస్తే.. సిరాజ్ తనదైన స్టైల్లో దుమ్మురేపాడు. రెండవ ఓవర్‌లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టాడు. తన ఓవర్‌ను మేడిన్ చేసి ఔరా అనిపించాడు. ఈ ఇద్దరు బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఆదిలోనే విలవిల్లాడిపోయారు.


ఇదికూడా చదవండి:చంద్రబాబుకు తెలంగాణ పోలీసుల షాక్.. కేసు నమోదు!

ఓపెనర్లు మొదటి రెండు ఓవర్లలోనే పెవిలియన్ చేరడంతో.. శ్రీలంక టీమ్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేవలం 3 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. 5 ఓవర్లు ముగిసే సరికి 7 పరుగులతో 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక టీమ్. టీమిండియా బౌలర్ల దూకుడుతో.. శ్రీలంకం ఇంటికి.. భారత్‌కు సెమీస్ బెర్త్ ఖాయం అయినట్లు కనిపిస్తోంది.

ఇదికూడా చదవండి:ఆర్జీవీకి బిగ్ షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు.. వ్యూహం సినిమాకు నో పర్మీషన్..!

Advertisment
తాజా కథనాలు