IND VS SA: ఫేర్‌వెల్‌ సిరీస్‌లో సెంచరీ.. సెల్యూట్‌ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?

సెంచూరియన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు-రెండో రోజు ఆటలో సౌతాఫ్రికా పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. 11 పరుగుల లీడ్‌లో ఉంది. క్రీజులో సెంచరీ హీరో ఎల్గర్‌ ఉన్నాడు.

New Update
IND VS SA: ఫేర్‌వెల్‌ సిరీస్‌లో సెంచరీ.. సెల్యూట్‌ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?

సెంచూరియన్‌ వేదికగా జరుగుతున్న దక్షిణాఫ్రికా(South Africa) వర్సెస్‌ ఇండియా(India) రసవత్తరంగా సాగుతోంది. అయితే ఇప్పటివరకు చూస్తే ప్రోటిస్‌దే పైచేయి. రెండో రోజు ఆటలో దాదాపు అన్నీ సెషన్లు సఫారీలే డామినేట్ చేశారు. అయితే లాస్ట్ సెషన్‌లో వరుస పెట్టి రెండు వికెట్లు పడడం భారత్‌కు పాజిటివ్‌ థింగ్‌గా చెప్పాలి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. క్రీజులో సెంచరీ హీరో డీన్‌ ఎల్గర్‌, మార్కో జెన్సన్‌ ఉన్నారు. ఎల్గర్‌ 140 పరుగులతో నాటౌట్‌గా అదరగొడుతున్నాడు. భారత్‌పై దక్షిణాఫ్రికా 11 పరుగుల లీడ్‌లో ఉంది.


9ఏళ్ల తర్వాత సెంచరీ:
తన కెరీర్‌లో చివరి సిరీస్‌ ఆడుతున్న డీల్‌ ఎల్గర్‌ తన జీవితకాలం గుర్తిండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఎల్గర్‌ అద్భుతంగా రాణించాడు. దూకుడిగా బ్యాటింగ్‌ చేస్తూ భారత్‌ బౌలర్లపై దాడి చేశాడు. సిరాజ్‌, శార్దూల్‌ వన్డే తరహాలో పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేయగా.. సిరాజ్‌, ఠాకూర్‌, ప్రసిద్‌కృష్ణ ఓవర్‌కు 4 పరుగుల చొప్పున ఇచ్చుకున్నారు. వీరిపై అటాకింగ్‌ గేమ్‌ ఆడిన ఎల్గర్‌ తన కెరీర్‌లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 211 బంతుల్లో 140 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు ఉన్నాయి. ఓ దక్షిణాఫ్రికా ప్లేయర్‌ ఇండియాపై టెస్టుల్లో సెంచరీ చేయడం 9ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.


ఆదుకున్న రాహుల్:
అటు మిగిలిన బ్యాటర్లలో డేవిడ్‌ బెడిన్‌గామ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ప్రమాదకరంగా మారిన డేవిడ్‌-ఎల్గర్‌ జంటను సిరాజ్‌ విడదీశాడు. అటు బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌ తలో రెండు వికెట్లు తీయ్యగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశాడు. ఠాకూర్‌ వికెట్లమీ తియ్యలేదు. 12 ఓవర్లు వేసి ఏకంగా 57 రన్స్ ఇచ్చుకున్నాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 8 వికెట్లకు 208తో రెండు రోజు ఆట ప్రారంభించిన టీమిండియా మరో 37 రన్స్ మాత్రమే చేయగలిగింది. అయితే రాహుల్‌ టెస్టుల్లో 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిన్న ఆచుతూచీ బ్యాటింగ్‌ చేసిన రాహుల్ 73స్ట్రైక్‌ రేట్‌తో సెంచరీ చేయడం విశేషం. అటు సిరాజ్‌ కాసేపు సపోర్ట్ ఇచ్చాడు. 22 బంతుల్లో 5 పరుగులు చేసిన సిరాజ్‌ జట్టు స్కోరు 238 వద్ద 9వ వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత 245 రన్స్‌ వద్ద భారత్‌ ఆలౌట్ అయ్యింది.

Also Read: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్‌ బోల్డ్‌ డ్యాన్స్‌ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్‌ వీడియో!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు