/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Rohit-Sharma-jpg.webp)
Rohit Sharma on Chris Gayle Record:వెస్టిండీస్ మాజీ ఓపెనర్ క్రిస్ గేల్(Chris Gayle) అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు క్రిస్ గేల్ రికార్డుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కన్ను పడింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాలనుందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సిక్సర్ల విషయంలో తాను క్రిస్ గేల్‌ను బీట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.
క్రిస్ గేల్ రికార్డుపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
యూనివర్స్ బాస్ గా పేరుగాంచిన క్రిస్ గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడుగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్ గేల్ పేరిట 553 సిక్సర్లు ఉన్నాయి. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 539 సిక్సర్లు కొట్టాడు. ఈ విధంగా, యూనివర్స్ బాస్ రికార్డుకు రోహిత్ శర్మ కేవలం 14 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నేను చిన్నతనంలో, కోచ్ నన్ను సిక్సర్లు కొట్టడానికి చాలా ప్రోత్సహించాడు. బంతిని సులువుగా బౌండరీ దాటించే క్రిస్ గేల్ లాంటి శక్తిమంతుడివి కాదంటూ రెచ్చగొట్టేశారు. ఈ విధంగా నా ఆట తీరును మెరుగుపరిచుకునేలా ప్రోత్సహించారు’ అని గుర్తు చేసుకున్నాడు రోహిత్ శర్మ.
సిక్స్‌లు కొట్టడం చాలా ముఖ్యం..
‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పుడు, క్రికెట్‌లో టైమింగ్ చాలా ముఖ్యమని కోచ్ చెప్పేవారు. భారీ షాట్లు ఆడవచ్చని జూనియర్ స్థాయిలోనే నేర్పించారు. ఇందుకోసం మనసు, ఫోకస్ స్థిరంగా ఉండాలని సూచించారు. అలాగే, వీలైనంత వరకు శరీరాన్ని బంతికి అనుకూలంగా ఉంచుకోవాలి. మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడం చాలా ముఖ్యం.’ ఈ విషయంలో తన కోచ్ తనను ప్రోత్సహించేవారని చెప్పాడు రోహిత్ శర్మ. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే సూపర్-4 రౌండ్‌లో భారత జట్టు సెప్టెంబర్ 10న రంగంలోకి దిగనుంది. సూపర్-4 రౌండ్‌లో పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో భారత జట్టు తలపడనుంది. ఇక ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగుతుంది.
టీమిండియా ప్రపంచకప్ టీమ్ ఇదే..
🚨 NEWS 🚨
India’s squad for #CWC23 announced 🔽#TeamIndia
— BCCI (@BCCI) September 5, 2023
𝗪𝗘 𝗔𝗥𝗘 𝗧𝗘𝗔𝗠 𝗜𝗡𝗗𝗜𝗔! 🇮🇳 👏#CWC23 | #TeamIndiapic.twitter.com/Forro8kCYL
— BCCI (@BCCI) September 5, 2023
Also Read:
Ayushman Card Eligibility: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..