IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. సడన్‌గా టీమ్‌ని వీడిన అశ్విన్.. ఎందుకంటే? ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రవిచంద్రన్ అశ్విన్ భారత టెస్టు జట్టు నుంచి వైదొలిగాడు. రాజ్‌కోట్ టెస్టులో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మూడు రోజులు అశ్విన్ అందుబాటులో ఉండడు. నిన్న జాక్ క్రావ్‌లీ వికెట్ ద్వారా టెస్టుల్లో అశ్విన్ 500వ వికెట్ సాధించిన విషయం తెలిసిందే. By Trinath 17 Feb 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Ashwin Out of Team India Due to medical emergency: మూడో టెస్టులో ఇండియా, ఇంగ్లండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ లక్ష్యం సాధించగా.. ఇంగ్లండ్ సైతం ధీటుగా బదులిస్తోంది. బాజ్ బాల్ బ్యాటింగ్ శైలీలో దుమ్ములేపుతోంది. నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 35 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. ఓపెనర్ బెన్ డక్కెట్ 118 బంతుల్లోనే 133 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక జో రూట్ సైతం క్రీజులోనే ఉన్నాడు. భారత్ సాధించిన రన్స్‌కు ఇంగ్లండ్ ఇంకా 238 రన్స్ వెనకబడి ఉంది. ఇదే సమయంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 500 టెస్టు వికెట్ల హీరో రవిచంద్రన్ అశ్విన్ జట్టును వీడాడు. #Ashwin500 🫡pic.twitter.com/PsHX9in0hB — Rajasthan Royals (@rajasthanroyals) February 16, 2024 మెడికల్ ఎమెర్జన్సీతో లీవ్: నిన్న రెండో రోజు ఆటలో జాక్ క్రావ్‌లీ వికెట్ పడగొట్టడం ద్వారా అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 500వ వికెట్ మైలురాయిను అందుకున్నాడు. ఈ ఫీట్ ద్వారా అశ్విన్ రెండు ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. తక్కువ బాల్స్ వేసి 500 వికెట్లు తీసిన వారిలో అశ్విన్ రెండో ప్లేస్‌లో నిలవగా.. తక్కువ మ్యాచ్‌లలో 500 వికెట్లు తీసిన బౌలర్లలో కూడా అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే రెండో రోజు మ్యాచ్ ముగిసిన తర్వాత అశ్విన్ సడన్ లీవ్ పెట్టాడు. ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రవిచంద్రన్ అశ్విన్ తక్షణమే భారత టెస్టు జట్టు నుంచి వైదొలిగాడు. రాజ్‌కోట్ టెస్టులో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మూడు రోజులు అశ్విన్ అందుబాటులో ఉండడు. R Ashwin withdraws from the 3rd India-England Test due to family emergency. In these challenging times, the Board of Control for Cricket in India (BCCI) and the team fully supports Ashwin.https://t.co/U2E19OfkGR — BCCI (@BCCI) February 16, 2024 'చాంపియన్ క్రికెటర్, అతని కుటుంబానికి BCCI తన హృదయపూర్వక మద్దతును అందిస్తుంది. ఆటగాళ్ళు, వారి ప్రియమైనవారి ఆరోగ్యం, శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. అశ్విన్, అతని కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని బోర్డు అభ్యర్థిస్తుంది. ఇది సవాలు సమయం.' అని బీసీసీఐ చెప్పింది. Also Read: 500 వికెట్ల క్లబ్‌లో ఆర్. అశ్విన్ WATCH: #ravichandran-ashwin #india-vs-england మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి