దేశమంతా కళ్ళప్పగించి చూస్తున్న వేళ.. కోట్లాది మంది కలలు భగ్నమవుతున్న తీరు.. అసలు ఊహించనిది.. కోరుకొనిది.. ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో ఆవిష్కృతం అయింది. పోరాడే స్కోర్ చేసే పరిస్థితి కూడా టీమిండియాకు దొరకలేదు. కళ్ళముందే కంగారూల కబుర్లు నిజం అవుతుంటే.. నిశ్చేష్టులవ్వడం యావత్ భారతదేశం వంతైంది. లక్షలమంది కేరింతలు కొట్టేలా చేయడం కాదు. అందరినీ సైలెన్స్ చేయడంలోనే మజా ఉందన్న ఆస్ట్రేలియా కెప్టెన్ కమ్మిన్స్ మాటలు రీసౌండ్ ఇచ్చాయి. భారతదేశం అంతా సైలెన్స్ మోడ్‌లోకి వెళ్ళగానే నిజం స్టేడియం కాదు.. దేశాన్నే సైలెన్స్ చేశారు ఆస్ట్రేలియన్లు. తంత్రం పనిచేయకపోతే కుతంత్రం పనిచేస్తుందని ఓ సినిమా డైలాగ్. ఇప్పుడు ఆస్ట్రేలియా అదే చేసిందా..? ఓటమి బాటలో ఉన్న బాధ్యలో ఇలా చెప్పడం లేదు.. ఇంకా టీమిండియా ఓడిపోలేదు. కానీ.. వరుసగా పది మ్యాచ్‌లు భారత్ గెలిచినపుడు.. ప్రపంచం అంతా అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. మొదట పిచ్‌ల విషయంలో భారత్ ఫిక్సింగ్ అన్నారు. తరువాత టాస్ టాంపరింగ్ అన్నారు.. టీమిండియా గెలుపును ఎవ్వరూ జీర్ణించుకోలేదు. ప్రపంచ క్రికెట్ అంతా స్లేడ్జింగ్ చేసింది. ఇప్పుడు.. దానిని మించిన పన్నాగం ఆస్ట్రేలియా చేసింది అనిపిస్తోంది. ఎందుకంటే..
టీమిండియా త్వరత్వరగా 3 వికెట్లు కోల్పోయింది. నిజమే.. కానీ నిలకడగా ఆడుతున్న కింగ్ కోహ్లీ.. రాహుల్ ద్వయం అద్భుతం చేస్తారని అనిపించింది. సరిగ్గా ఈ తరుణంలో ఒక అనుకోని సంఘటన జరిగినది. ఒక ఆగంతకుడు గ్రౌండ్‌లోకి పరిగెత్తుకు వచ్చాడు. కోహ్లీ వైపు దూసుకు వెళ్ళాడు.. అతనిని పట్టుకున్నాడు. తరువాత సెక్యూరిటీ స్టాఫ్ ఆ ఆగంతకుడ్ని అరెస్ట్ చేశారు. అంతే.. తరువాత ఆట స్వరూపమే మారిపోయింది కోహ్లీ ఆట గతి తప్పింది. స్టేడియంలో లక్షలాది అభిమానుల కేరింతల గందరగోళం.. ఆగంతకుని ఆగమనం.. కోహ్లీ ఏకాగ్రతను గమనం తప్పేలా చేసింది. ఇంకేముంది.. కోహ్లీ అవుట్. 5వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ వేగంగా పరుగులు సాధించాడు. కానీ.. 3 వికెట్లు పడటంతో, అతను ఇన్నింగ్స్‌ను తగ్గించి, టీమ్ ఇండియాపై నియంత్రణ సాధించాడు. విరాట్ తన యాభైని పూర్తి చేసిన తర్వాత సెట్ అయ్యాడు. కానీ.. 29వ ఓవర్‌లో, పాట్ కమ్మిన్స్ షార్ట్ పిచ్‌పై సింగిల్ తీసే ప్రయత్నంలో అతను బౌల్డ్ అయ్యాడు. బంతి అతని బ్యాట్‌కు తగిలి స్టంప్‌లోకి ప్రవేశించింది. విరాట్ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు 4 వికెట్లకు 148 పరుగులుగా మారింది. సరిగ్గా ఆ ఆగంతకుడు వచ్చిన తరువాత కొద్ది సేపట్‌లో కోహ్లీ అవుట్ అయ్యాడు.
ఇంతకీ వాడెవరు..?
కోహ్లీ దగ్గరకు వచ్చిన ఆగంతకుడు పాలస్తీనాకు సంబంధించిన టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అలాని అతను పాలస్తీనా వాడు కాదు. ఇక్కడే ట్విస్ట్.. ఆ వ్యక్తి ఆస్ట్రేలియా వాడు. పోలీసులు నాలుగు పీకితే.. నేను ఆస్ట్రేలియా వాడిని.. కోహ్లీ కోసం వచ్చానని చెప్పడమే కాకుండా.. నాకు పాలస్తీనా ఇష్టం అని కూడా అన్నాడు. పిచ్.. టాస్ అంటూ పనికిమాలిన కూతలు కూసిన వారు ఇప్పుడేమంటారు..? మేం కోహ్లీ అవుట్‌కు కారణం.. ఆస్ట్రేలియా పన్నిన పన్నాగం.. ఆస్ట్రేలియా నియమించిన వ్యక్తి అని అంటున్నాం. ఇదంతా ఆస్ట్రేలియా టీం ప్రీ ప్లాన్ అంటున్నాం. అందుకే కమ్మిన్స్ అంతా కచ్చితంగా గ్రౌండ్ అంతా సైలెన్స్ చేయించడంలోనే మజా ఉందని చెప్పాడని అంటున్నాం.. కాదనగలరా..? మరి మీరేమంటారు..?