టీ20 ప్రపంచకప్(World Cup) సాధించిన తొలి టీమ్ టీమిండియానే. 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ జరగగా.. ధోనీ కెప్టెన్సీలోని భారత్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఇలా ఇండియాకు పొట్టి ఫార్మెట్‌లో తొలి నుంచి మంచి విక్టరీలే ఉన్నాయి. తర్వాత వరల్డ్‌కప్ గెలవకున్నా నిలకడగానే రాణిస్తూ వస్తోంది. మంచి విజయాలు సాధిస్తోంది. అటు వన్డే, టెస్టుల్లో చారిత్రాక విజయాలు సొంతం చేసుకుంటూనే టీ20పైనే మంచి పట్టు కంటీన్యూ చేసింది. అయితే 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత మరోసారి టైటిల్ గెలవకపోవడం అభిమానులను నిరాశ పరిచే అంశం. ఇక తాజాగా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లోనూ భారత్ ఓడిపోడడాన్ని ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత నాలుగు రోజులకే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ మొదలుపెట్టింది ఇండియా. నిన్న(డిసెంబర్ 1) వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్ సరీస్‌ను కైవసం చేసుకోవడంతో పాటు మరో మైలురాయిను అందుకుంది.
టాప్ విన్నింగ్ టీమ్:
రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం (డిసెంబర్ 1) జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టీ20లో సూర్యభాయ్ జట్టు 20 రన్స్ తేడాతో కంగారూలను ఓడించింది. డిసెంబర్ 3న(రేపు) ఐదో టీ20 జరగనుండగా.. నిన్నటి గెలుపుతోనే భారత్ సిరీస్ వశం చేసుకుంది. ఇది టీ20 చరిత్రలో భారత్‌కు 136వ విజయం. ఈ గెలుపుతో 135 విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉన్న పాకిస్థాన్ రికార్డు బద్దలైంది.
టీ20ల్లో అత్యధిక విజయాలు
136 - భారత్, మ్యాచ్‌లు-213
135 - పాకిస్థాన్, మ్యాచ్‌లు-226
102 - న్యూజిలాండ్, మ్యాచ్‌లు-200
95 - దక్షిణాఫ్రికా, మ్యాచ్‌లు-171
95 - ఆస్ట్రేలియా,మ్యాచ్‌లు-181
Also Read: జస్ట్ మిస్..లేకపోతే అంపైర్ అవుట్..జితేష్ స్ట్రోక్ అలాంటిది మరి!
WATCH: