IND vs AUS: రుతురాజ్ గైక్వాడ్ (123; 57 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియాతో గుహవాటిలో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోరు సాధించింది. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడిన రుతురాజ్ 200కు పైగా స్ట్రైక్ రేటుతో రెచ్చిపోయి ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇది కూడా చదవండి: టోర్నీ మొత్తంలో ఆ వికెట్టే నాకు సంతృప్తినిచ్చింది.. ప్యాట్ కమిన్స్
లాస్ట్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యశస్వి నిరాశపరచగా, ఇషాన్ డకౌట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడుతూ రుతురాజ్ కు సహకరించాడు. తిలక్ వర్మ కూడా క్రీజులో నిలబడడంతో ఆస్ట్రేలియా ముందు భారత్ భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్ సన్, బెరెన్ డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు.