Influenza A virus: పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్లు..మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు..!!

గత కొద్ది రోజులుగా ఫ్లూ కేసులు పెరిగుతున్నాయని... ముఖ్యంగా H3N2 కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది కాకుండా, కొంతమంది రోగులలో H1N1 సంక్రమణ కూడా కనిపించినట్లు చెబుతున్నారు. ఇన్‌ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి, ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

Influenza A virus: పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ ఇన్‌ఫెక్షన్లు..మాస్క్ తప్పనిసరి అంటున్న వైద్యులు..!!
New Update

Influenza A virus: దేశవ్యాప్తంగా డెంగ్యూతో పాటు ఇన్‌ఫ్లుఎంజా ఏ, హెచ్3ఎన్2 వైరస్, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) ఇన్‌ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఫ్లూతో బాధపడుతూ, శ్వాసకోశ సమస్యలతో కూడా రోగులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అందుకే దగ్గు, జలుబు, గొంతునొప్పితో పాటు జ్వరం వచ్చినా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దేశరాజధాని ఢిల్లీ(Delhi) లో ఇన్‌ఫ్లుఎంజా ఎ, స్వైన్ ఫ్లూ (swine flu) ఇన్‌ఫెక్షన్లు భారీగా నమోదు అవుతున్నాయి. . షాలిమార్ బాగ్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌లో పల్మనరీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ వికాస్ మౌర్య మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా ఫ్లూ కేసులు పెరిగాయని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: రక్షకులే నేరస్థులుగా మారితే ఎలా?…హైకోర్టు ఆగ్రహం..!!

ముఖ్యంగా H3N2 కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఇది కాకుండా, కొంతమంది రోగులలో H1N1 సంక్రమణ కూడా కనిపించిందని... H3N2 ఇన్ఫెక్షన్ H1N1 కంటే తక్కువ తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుందని తెలిపారు. అయినప్పటికీ, H3N2 సోకిన కొంతమంది రోగులకు వెంటిలేటర్ మద్దతు కూడా అవసరముంటుందని తెలిపారు. రోగులకు దగ్గు (Cough), జలుబు (Cold) తో పాటు 102 నుండి 103 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు అధిక జ్వరం (Fever) ఉంటుందని ఆయన చెప్పారు. కొంతమంది రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కూడా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న కొంతమంది రోగులకు కూడా ఫ్లూ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కాలేదన్నారు. కానీ వారికి ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని అపోలో ఆసుపత్రి ఇంటర్నల్ మెడిసిన్ విభాగం నిపుణుడు డాక్టర్ సురంజిత్ ఛటర్జీ తెలిపారు. ఇటీవలి కాలంలో H1N1, ఇన్‌ఫ్లుఎంజా A కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. దీని నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు మాస్క్‌లు తప్పకుండా ధరించాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య

చేతుల పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి. చేతులు కడుక్కోకుండా ముఖాన్ని తాకకూడదు. ఇది కాకుండా, ప్రజలు ఫ్లూ నిరోధించడానికి టీకా కూడా తీసుకోవచ్చని వెల్లడించారు. దగ్గు, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, కీళ్లనొప్పులు, నీరసం, అలసట, శరీరంపై దద్దర్లు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. ఆస్తమా, డయాబెటిస్ పేషంట్లతోపాటు చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. .

#symptoms #influenza #h1n1 #swine-flu-infection #influenza-a-virus #h1n1-influenza #swine-flu #influenza-a-virus-subtype-h1n1 #influenza-a-virus-symptoms
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe