December Inflation: ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం టెన్షన్.. ఎంత పెరిగిందంటే.. 

నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో డిసెంబర్ లో ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.69 శాతంగా నమోదైంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఒడిస్సాలో  8.73 శాతం, తెలంగాణలో 6.65 శాతంగానూ ద్రవ్యోల్బణం నమోదు అయింది 

December Inflation: ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం టెన్షన్.. ఎంత పెరిగిందంటే.. 
New Update

December Inflation: ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 4 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం, డిసెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.69 శాతంగా నమోదైంది.  ఇది 4 నెలల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. అంతకుముందు నవంబర్‌లో ద్రవ్యోల్బణం 5.55 శాతంగా ఉంది. గణాంకాల ప్రకారం, డిసెంబర్‌లో, నగరాల కంటే గ్రామాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది.  పట్టణ ద్రవ్యోల్బణం రేటు 5.46 శాతంగా - గ్రామీణ ద్రవ్యోల్బణం(December Inflation) రేటు 5.93 శాతంగా నమోదైంది.

నిత్యావసరాల ధరల పెరుగుదలతోనే.. 

గణాంకాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, పండ్లు - చక్కెర ద్రవ్యోల్బణం(December Inflation) రేటును 4 నెలల్లో అత్యధిక స్థాయికి తీసుకెళ్లడంలో అత్యంత దోహదపడ్డాయి, అంటే వంటగదిలో ఉపయోగించే ప్రతి వస్తువు ఖరీదైనదిగా మారింది.   డిసెంబర్‌లో కూరగాయల ద్రవ్యోల్బణం 27.64 శాతం, పప్పులు 20.73 శాతం, సుగంధ ద్రవ్యాలు 19.69 శాతం, పండ్లు 11.14 శాతం, చక్కెర 7.14 శాతంగా నమోదయ్యాయి. మొత్తం ఆహార ద్రవ్యోల్బణం(December Inflation) 9.53 శాతంగా నమోదైంది. ఇది కాకుండా, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం కూడా 7 శాతానికి పైగానే ఉంది.

Also Read: స్టాక్ మార్కెట్ జంప్.. రూపాయి స్ట్రాంగ్.. మూడు కారణాలు.. 

రాష్ట్రాల వారీగా ఇలా.. 

రాష్ట్రాల వారీగా చూస్తే కనుక, డిసెంబర్‌లో దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం(December Inflation)ఒడిశాలో నమోదైంది, ఇక్కడ ద్రవ్యోల్బణం రేటు 8.73 శాతంగా ఉంది. దీని తర్వాత గుజరాత్‌లో 7.07 శాతం, రాజస్థాన్‌లో 6.95 శాతం, హర్యానాలో 6.72 శాతం, కర్ణాటక, తెలంగాణలో 6.65 శాతం, మహారాష్ట్రలో 6.08 శాతం, పంజాబ్‌లో 5.95 శాతం, బీహార్‌లో 5.89 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది. మొత్తం 9 రాష్ట్రాలద్రవ్యోల్బణం రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 

ఈ లెక్కల తరువాత మళ్ళీ రెపోరేటు పెరిగే అవకాశాలపై ఆందోళన మొదలవుతోంది. ద్రవ్యోల్బణం(December Inflation) పెరిగేతే సాధారణంగా ఆర్బీఐ రెపోరేట్లు పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో లోన్స్ పై వడ్డీ రేట్లు పెరగడం జరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు తీసుకునే చర్యలలో ప్రధానమైనది వడ్డీరేట్లను పెంచడం. తరువాత మరిన్ని చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.

Watch this interesting Story:

#rbi #inflation
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe