Income Tax: డైరెక్ట్ టాక్స్ వసూళ్ల సునామీ.. ఎన్ని లక్షల కోట్ల పన్నులు వచ్చాయంటే..  

ఇప్పటివరకూ డైరెక్ట్ టాక్స్ కలెక్షన్స్ అదిరిపోయాయి. గత సంవత్సరం ఇదే కాలానికంటే 17.59% ఎక్కువగా టాక్స్ వసూళ్లు జరిగినట్టు CBDT లెక్కలు చెబుతున్నాయి.

New Update
Income Tax: డైరెక్ట్ టాక్స్ వసూళ్ల సునామీ.. ఎన్ని లక్షల కోట్ల పన్నులు వచ్చాయంటే..  

Income Tax: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ టాక్స్ వసూళ్లకు సంబంధించిన తాత్కాలిక గణాంకాలను విడుదల చేసింది. డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 9 వరకు ప్రభుత్వం ₹12.37 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలు చేసింది. ఇది  గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం కంటే 17.59% ఎక్కువ. గత నెల 10వ తేదీ నుంచి నవంబర్‌ 9వ తేదీ వరకు దాదాపు 1.3 లక్షల కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అక్టోబర్ 9 వరకు ప్రభుత్వం రూ.11.07 లక్షల కోట్ల పన్ను వసూలు చేసింది.

రీఫండ్ తర్వాత నికర వసూళ్లు ₹10.60 లక్షల కోట్లు.. 

 కాగా, రీఫండ్ మినహా నికర వసూళ్లు ₹10.60 లక్షల కోట్లుగా ఉన్నాయి.  గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 21.82% పెరిగింది. ఏప్రిల్ 1 - నవంబర్ 9 మధ్య ₹1.77 లక్షల కోట్ల విలువైన టాక్స్ రిటర్న్స్ ను ప్రభుత్వం జారీ చేసింది.

Also Read: PAN Card: 11.5 కోట్ల పాన్‌ కార్డులు డీ యాక్టివేట్‌ ..కేంద్రం ఏం తెలిపిందంటే!

వసూళ్ల లక్ష్యంలో 58.15% పూర్తి..
నవంబర్ 9వ తేదీ వరకు వసూలు చేసిన తర్వాత ప్రభుత్వం తన పన్ను వసూళ్ల అంచనాలో 58.15% పూర్తి చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ₹18.23 లక్షల కోట్ల డైరెక్ట్ టాక్స్ వసూళ్లను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత నెల సేకరణ తర్వాత ఈ లక్ష్యం 52.50%కి చేరుకుంది.

వ్యక్తిగత ఆదాయపు పన్ను వృద్ధి 28.29%..
వివిధ వర్గాల్లో పన్ను వసూళ్ల విషయానికి వస్తే, కార్పొరేట్ ఆదాయపు పన్ను (CIT) వార్షిక ప్రాతిపదికన 7.13% పెరిగింది. వ్యక్తిగత ఆదాయపు పన్ను (పిఐటి) గత ఏడాది కంటే 28.29% ఎక్కువ వసూలు అయింది. 

మొత్తం CIT సేకరణ నుంచి రీఫండ్‌లను మినహాయిస్తే, వార్షిక వృద్ధి 12.48%. PIT గురించి చెప్పుకుంటే ఇది వార్షిక ప్రాతిపదికన 31.26% వృద్ధిని సాధించింది.

ప్రత్యక్ష - పరోక్ష పన్నుల మధ్య తేడా ఏమిటంటే..
ప్రత్యక్ష పన్ను అనేది సామాన్యుల నుంచి నేరుగా వసూలు చేసే పన్ను. ప్రత్యక్ష పన్నులో కార్పొరేట్ - వ్యక్తిగత ఆదాయపు పన్ను(Income Tax) ఉంటుంది. షేర్లు లేదా ఇతర ఆస్తులపై విధించే పన్ను కూడా ప్రత్యక్ష పన్ను పరిధిలోకి వస్తుంది.

సాధారణ ప్రజల నుంచి నేరుగా తీసుకోని, ఇతర మార్గాల ద్వారా సాధారణ ప్రజల నుంచి వసూలు చేసే పన్నును పరోక్ష పన్ను అంటారు. ఇందులో ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ డ్యూటీ, జీఎస్టీ ఉన్నాయి.

ప్రభుత్వం జూలై 1, 2017 నుంచి GSTని వసూలు చేస్తుంది.
ఇంతకు ముందు దేశంలో అనేక రకాల పరోక్ష పన్నులు ఉండేవి. కానీ జూలై 1, 2017 నుండి, అన్ని రకాల పరోక్ష పన్నులు GSTలో చేర్చారు. అయితే, పెట్రోలియం ఉత్పత్తులు - మద్యంపై పన్నులు ప్రస్తుతం GST పరిధి నుంచి దూరంగా ఉంచారు.  పన్ను వసూలు అనేది ఏ దేశంలోనైనా ఆర్థిక కార్యకలాపాలకు సూచికగా పరిగణిస్తారు. 

2022-23 ఆర్థిక సంవత్సరానికి GST కలెక్షన్స్..
2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 18.10 లక్షల కోట్ల మొత్తం GST కలెక్ట్ అయింది. దీని ఆధారంగా ప్రతినెలా సగటున జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో అత్యధిక GST వసూళ్లు జరిగాయి. ఏప్రిల్‌లో ఇది రూ.1.67 లక్షల కోట్లు. దీని తర్వాత, మార్చి 2023లో అత్యధిక GST సేకరణ రూ. 1.60 లక్షల కోట్లు, ఇది ఇప్పటి వరకు రెండవ అత్యధిక GST కలెక్షన్. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు