ఉద్యోగులకు తీపి కబురు...ఐటీ నిబంధనల్లో మార్పు... పెరగనున్న టేక్ హోం శాలరీలు....!

ఉద్యోగులకు ఆదాయ పన్ను శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ అందిస్తున్న అద్దె రహిత వసతి ( రెంట్ ఫ్రీ అకామిడేషన్) ఉపయోగించుకుంటున్న ఉద్యోగులకు భారీ ఊరటను ఇచ్చింది. పన్ను నిర్ణయించే విధానంలో అలాంటి సౌకర్యాల విలువను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అద్దె రహిత వసతి సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న వారికి పన్ను తగ్గడంతో టేక్ హోం శాలరీలు పెరిగే అవకాశం ఉంది.

New Update
ఉద్యోగులకు తీపి కబురు...ఐటీ నిబంధనల్లో మార్పు... పెరగనున్న టేక్ హోం శాలరీలు....!

ఉద్యోగులకు ఆదాయ పన్ను శాఖ(It department) గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ అందిస్తున్న అద్దె రహిత వసతి ( rent free accomidation) ఉపయోగించుకుంటున్న ఉద్యోగులకు భారీ ఊరటను ఇచ్చింది. పన్ను నిర్ణయించే విధానంలో అలాంటి సౌకర్యాల విలువను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో అద్దె రహిత వసతి సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న వారికి పన్ను తగ్గడంతో టేక్ హోం శాలరీలు పెరిగే అవకాశం ఉంది.

తాజాగా రెంట్ ఫ్రీ అకామిడేషన్ కు సంబంధించి నిబంధనల్లో పలు మార్పులు చేసింది. దీనికి సంబంధించి శుక్రవారం రాత్రి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నిబంధనలు వచ్చే నెల మొదటి వారంలో అమలులోకి వస్తాయని ఆదాయపన్ను కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ వెల్లడించింది. తాజా పన్ను విధానంతో ఉద్యోగుల టేక్ హోం శాలరీలు పెరుగుతాయని సీబీడీటీ వెల్లడించింది.

రెంట్ ఫ్రీ అకామిడేషన్ వినియోగించుకునే వారికి గతంలో వారి వేతనంలో 15 శాతంగా పన్ను విధించే వారు. కానీ తాజాగా దాన్ని తగ్గించినట్టు సీబీడీటీ చెప్పింది. ఇక నుంచి ఆ అకామిడేషన్ కోసం ఉద్యోగులకు వారి వేతనాల్లో 10 శాతం పన్నును విధించనున్నట్టు ప్రకటించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల జనాభా దాటిన నగరాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది గతంలో ఇది 2001 జనాభా లెక్కల ప్రకారం 25 లక్షల జనాభా కన్నా ఎక్కువ ఉన్న నగరాలకు ఈ నిబంధన వర్తింప చేసే వారు.

2011 జనాభా లెక్కల ప్రకారం 15 లక్షల నుంచి 40 లక్షల మధ్య జనాభా గల నగరాల్లో ఉద్యోగులకు వారి వేతనాల్లో 7.5 శాతం పన్ను విధిస్తామని చెప్పింది. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10 నుంచి 25 లక్షల జనాభా గల నగరాలకు ఈ పన్ను విలువను వర్తింప చేసేవారు. తాజా విధానంతో పన్ను విలువ తగ్గడంతో ఉద్యోగుల టేక్ హోం జీతాలు పెరుగుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు