Vizianagaram: విజయనగరం జిల్లాలో జవాన్ దారుణానికి పాల్పడ్డాడు. యూట్యూబ్ లో చూసి భార్య హత్య చేశాడు. భార్యపై అనుమానంతో పెళ్లయిన 3 నెలలకు చంపేశాడు. ఆమెను పథకం ప్రకారం హత్య చేశాడు. భార్య పాత ప్రియుడుపై నేరం మోపేందుకు ప్రయత్నం చేశాడు. టెక్నికల్‌గా కేసును పోలీసులు సాల్వ్ చేశారు. జవాన్ జగదీష్‌ను అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు.
అసలేం జరిగింది..
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం బంగారంపేట కు చెందిన టి అనూష (20) కు అదే గ్రామానికి ఆమె స్నేహితుడు జగదీష్ తో నాలుగు నెలలు క్రితం పెళ్లి జరిగింది. జగదీష్ జమ్మూకాశ్మీర్ లో CPRF జవాన్ గా పనిచేస్తున్నాడు. కుమార్తె కు పెళ్లి చేసామన్న సరదా ఆమె కన్న తల్లిదండ్రులుకు తీరకముందే.. ఇంటికి కుత వేటు దూరంలో కన్న కూతురు అనూష శవమై పడి ఉండటంతో కుటుంబ సభ్యుల బాద వర్ణాతీతంగా మారింది.
గ్రామంలో గ్రామ దేవత పండగ ఒక వైపు జరుగుతుండగా మరో వైపు కన్న కూతురు అనూష శవమై కనిపించడంతో ఎవరు చేశారు.. ఎందుకు చేశారో.. ఎవ్వరికీ అంతు చిక్కలేదు. ప్రారంభంలో అనూష స్నేహితులు తరచుగా ఆమెను ఇబ్బందులు పెడుతున్నారని, గతంలో ఆమె చెపుతడంతో ఆమె స్నేహితులుపై తలిదండ్రులు కు అనుమానం వచ్చింది.. అదే విషయాన్ని పోలీసులు కు తెలిపారు.
కుటుంబ సభ్యులు పిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించి.. చివరకు ఆమె భర్త పై అనుమానం రావడంతో టెక్నికల్ ఎవిడన్స్ తో పాటుగా మృతురాలి పోష్ట్ మర్టాం రిపోర్ట్ ను క్రోడీకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు ఉపయోగించే నైలెన్ తాడు, రెండు గ్లౌజ్ లు, ఒక బైక్ ను స్వాదీన పరచుకొని దర్యాప్తు చేపట్టారు. చివరకు మృతురాలి భర్త జగదీష్.. అతని బార్య అనూష ను హత్య చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు.