Freshers : రానున్న కాలంలో ఐటీ కంపెనీ(IT Companies) ల్లో ఫ్రెషర్ల నియామకాలు(Freshers Jobs) భారీగా తగ్గిపోనున్నాయా.. ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు మళ్లీ ఎదురవనున్నాయా.. అంటే అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. బిజినెస్ తగ్గిపోతున్న నేపథ్యంలో ఫ్రెషర్లను నియమించుకోవడంలో ఐటీ కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన టీమ్ లీజ్ నివేదిక కూడా దీనిని స్పష్టం చేస్తోంది. రానున్న రోజుల్లో ఫ్రెషర్ల నియామకం భారీగా తగ్గిపోతుందని నివేదికలో హైలైట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్లకు నియామకాలు ఇచ్చే తేదీల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం.
మాడుపగిలే తీర్పు ఖాయం 2022–23 సంవత్సరాల్లో పలు ఐటీ కంపెనీలు ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు(Campus Interviews) నిర్వహించి పలువురికి ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయి. వాటికి సంబంధించి నియామకం విషయంలో మాత్రం ఇప్పటికీ సాగదీత ధోరణే అవలంబిస్తున్నాయి. అంతేకాదు.. 2023 జూలై 1 నుంచి.. 2024 జూన్ 30 వరకు కూడా ఫ్రెషర్ల నియామకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీంతో నియామకాలపై ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఫ్రెషర్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇదే క్రమంలో బిజినెస్ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ దీనిపై ప్రశ్నిస్తోంది.
Also Read : వైసీపీకి మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా..!
కోవిడ్–19(Covid-19) సమయంలో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఐటీ రంగం మాత్రం భారీ లాభాల్లో గడించింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే.. టెక్కీలు మాత్రం రోజుకు రెండు, మూడు ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించారు. 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2022 మధ్య కాలంలో టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్‌తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్స్‌ను నియమించుకున్నాయి. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం.. గత రెండు బ్యాచ్‌లలో 20 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థులు ఆఫర్ లెటర్లు పొందారు. ప్రస్తుతం వారిని ప్రాజెక్టుకు తీసుకునే విషయంలో మాత్రం సంస్థలు జాప్యం చేస్తున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి ముందు ముందు కూడా కొనసాగుతుందంటేనే ఫ్రెషర్లు తలలు పట్టుకుంటున్నారు.