దీపావళి పండుగ చేసుకోవాలంటనే వణికిపోతున్న ఊరు..ఎక్కడ ఉందంటే!

200 సంవత్సరాల క్రితం జరిగిన విషాద సంఘటనల వల్ల శ్రీకాకుళం జిల్లా పున్నానపాలెం గ్రామస్థులు దీపావళి పండుగకు దూరమయ్యారు.

దీపావళి పండుగ చేసుకోవాలంటనే వణికిపోతున్న ఊరు..ఎక్కడ ఉందంటే!
New Update

దీపావళి పండుగ వస్తుందంటనే వారం రోజుల ముందు నుంచే పిల్లలు టపాసులు కాలుస్తూ సందడి చేస్తుంటారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఘనంగా దీపావళిని జరుపుకుంటారు. కానీ ఈ గ్రామంలో మాత్రం చీకట్లను పారదోలే దీపావళిని జరుపుకోకుండా చీకట్లలోనే ఉండిపోతారు.

ఇంతకీ ఆ గ్రామంలోని ప్రజలు ఎందుకు దీపావళి జరుపుకోరు..ఎప్పటి నుంచి జరుపుకోరు..వెలుగుల పండుగ ఆ గ్రామస్థుల జీవితాల్లో ఎందుకు చీకట్లు నింపింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీపావళి పండుగను జరుపుకోవడం లేదు.

ఎందుకంటే దీపావళి పండుగ నాడే ఉయ్యాలలో నిద్రిస్తున్న చిన్నారి పాము కాటుకు గురై మరణించిందంట..అదే రోజు ఓ రైతుకు చెందిన రెండు ఎద్దులు కూడా మృతి చెందడంతో గ్రామస్థులంతా కూడా విషాదంలో మునిగిపోయారు. అప్పటి నుంచి తమ ఊర్లో దీపావళి పండుగ జరుపుకోకూడదని పెద్దలు తీర్మానించారని స్థానికులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే నాగుల చవితి రోజున కూడా మరో విషాదం జరగడంతో ఆ పండుగకు కూడా ఈ పున్నానపాలెం గ్రామస్తులు దూరం అయ్యారు. పండగనాడు ఈ గ్రామంలోని ఏ ఇంట్లో కూడా దీపం వెలగదు, ఒక టపాసు కూడా పేలదు. ఎవరైనా మొడితనంతో పండగ జరుపుకుంటే వారింట్లో అశుభం జరుగుతుందని వారి నమ్మకం.గ్రామంలో చదువుకున్నవాళ్లు ఉన్నప్పటికీ....వారంతా గ్రామ పెద్దలు నిర్ణయించిన కట్టుబాటు గౌరవిస్తూ ఆచారాన్ని పాటిస్తున్నారు.

కర్ణాటకలో కూడా...

కర్ణాటక దావణగెరె జిల్లాలోని లోకికెరె ప్రాంత ప్రజలు సుమారు 200 సంవత్సరాల నుంచి దీపావళి పర్వదినానికి దూరంగా ఉంటున్నారు.గతంలో జరిగిన సంఘటనల వల్ల దీపావళిని చీకటి రోజుగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. కేవలం గ్రామంలో ఉన్న వారు మాత్రమే కాదు. గ్రామం నుంచి బయట ఊర్లకు వెళ్లినా..ఆఖరికి విదేశాలకు వెళ్లిన కూడా ఈ పండుగను జరుపుకోరు. అందుకే దీపావళి నాడు జరిపే పూజను ముందుగానే విజయదశమి నాడు జరుపుకుంటారు.

మరికొంతమంది మహాలయ అమావాస్య నాడు జరుపుకుంటారు. అంతేకాకుండా దీపావళి నాడు పండుగ జరుపుకుంటే చెడు జరుగుతుందని నమ్ముతారు. దీపావళి రోజున పండుగ చేసుకుంటే మాత్రం కచ్చితంగా చెడు జరుగుతుందని వారు నమ్ముతారు. 200 సంవత్సరాల క్రితం లోకికెరె గ్రామానికి చెందిన కొందరు దీపావళి రోజున పెద్దల పండుగను జరుపుకోవడానికి కుశగడ్డి, పూలు తెచ్చేందుకు అడవికి వెళ్లారు. గడ్డి తీసుకురావడానికి వెళ్లిన వారెవరూ తిరిగి రాలేదు.

వారి కోసం వెళ్లిన వారికి ఎవరికీ కూడా ఆచూకీ లభించలేదు. దీంతో గ్రామంలో దీపావళిని జరుపుకోకూడదని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అప్పటి నుంచి పండుగను చేసుకోవటం మానేశారు.

తమిళనాడు లో...

ఇదిలా ఉంటే తమిళనాడు శివగంగై జిల్లాలోని 12 ప్రాంతాల ప్రజలు కూడా గడిచిన 60 సంవత్సరాలుగా దీపావళి పండుగ జరుపుకోవడం లేదు. వ్యవసాయ పనులు లేని సమయంలో పండుగను జరుపుకోవాలంటే ప్రజలపై ఆర్థికంగా భారం పడుతుందని ఆ గ్రామాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

అప్పటి నుంచి 12 గ్రామాల ప్రజలు ఈ పండుగకు జరుపుకోవటం లేదని స్థానికులు తెలిపారు. గ్రామస్థులు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు దూరంగా ఉంటారని చెప్పారు. 12 గ్రామాల ప్రజలు ఈ పండుగ రోజు చేయాల్సిన పూజలను సంక్రాంతి రోజున చేస్తారని వెల్లడించారు.

Also read: దీపావళి రోజున కొత్త చీపురుతో ఇలా చేస్తే కోటీశ్వరులు అవుతారు!

#srikakulam #diwali #no-celebrations
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe