ఏపీలో రాళ్లు పగిలేలా ఎండలు

మృగశిర వచ్చాక.. మరింత ఉక్కపోత.. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు.. అయితే ఈ ఏడాది మృగశిరలోనూ అంతకు మించిన ప్రభావం కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువయ్యాయి.

New Update
Heat Wave Effect: నాలుగు రోజులు.. ఏడు రాష్ట్రాలు.. 320 మరణాలు.. ఎండదెబ్బ మామూలుగా లేదుగా.. 

publive-image

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

మృగశిర వచ్చింది.. జూన్ నెల సగం అయిపోయినా ఇంకా ఎండలు దంచికొడుతూనే ఉన్నాయి. ఓ పక్క గుజరాత్లో వర్షాలతో అలకొల్లుగా ఉంటే ఏపీలో మాత్రం రాళ్లు పగిలేలా ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండలు ఎప్పుడు తగ్గాలి.. మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలని జనాలు సూర్య భగవాన్‌ని వేడుకుంటున్నారు. రోహిణి కార్తీ వచ్చినా గాని ఎండలు తగ్గటం లేదంటూ ఏపీ ప్రజలు వాపోతున్నారు. మృగశిర వచ్చాక మరింత ఉక్క పోత ఎక్కుకు కావడటంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అమరావతి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర వడగాలులు వీచే అవకాశం

రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు ఉన్నాయంటున్నారు అమరావతి ప్రజలు. అయితే ఈ ఏడాది మృగశిరలోనూ అంతకు మించిన ప్రభావం కనిపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువయ్యాయి. సాధారణం కంటే 10.8 డిగ్రీల వరకు పెరిగాయి. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో 46.8, కరపలో 46.7, సీతంపేటలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ వేసవిలోనే ఇది అత్యధికం. 370 మండలాల్లో 55% తీవ్ర వడగాలులు వీచాయి. రాష్ట్రంలో శనివారం కూడా ఎండల తీవ్రత కొనసాగుతుందని, 264 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు