/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/KADAPA.jpg)
Kadapa: కడప జిల్లాలో భూమి కుంగడం కలకలం రేపింది. దువ్వూరు మండలం చింతకుంటలో భూమి కుంగింది. భూకంపం వచ్చిందని ఒక్కసారిగా రైతులు భయపడ్డారు. వ్యవసాయభూమిలో 6 అడుగుల లోతు భూమి కుంగింది. పెద్దబావిలా సర్కిల్ ఆకారంలో భూమి కుంగిపోయింది. గతంలో కూడా ఇలానే భూమి కుంగిపోయిందని స్థానిక రైతు మానకొండు శివ తెలిపాడు. 2019లో ఇదే తరహాలో ఒక్కసారిగా భూమి కుంగిందని.. అప్పట్లో పూడ్చేందుకు 50వేలు ఖర్చు చేసినట్లు తెలిపాడు. కాగా భూమి కుంగుబాటుకు గల కారణాలను అధికారులు చెప్పలేక పోతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిన ఉంది.