Marriage Act: ఆడపిల్లల వివాహ వయస్సును 9 ఏళ్లకు తగ్గించే బిల్లును ఇరాక్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇది యావత్ దేశంలో పెను దుమారం రేపడంతో దేశ ప్రజలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మానవ హక్కుల సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాక్‌లో అమ్మాయిల వివాహ వయస్సు 18 సంవత్సరాలు. ఈ బిల్లును ఇరాక్ పార్లమెంట్ ఆమోదించినట్లయితే, 9 ఏళ్ల బాలికలు 15 ఏళ్ల అబ్బాయిలను వివాహం చేసుకోవచ్చు. ఇదీనివలన దేశంలో బాల్య వివాహాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాక్‌లో బాలికల కనీస వివాహ వయస్సు 9 ఏళ్లుగా నిర్ణయించే కొత్త చట్టాన్ని తీసుకు రావడానికి బిల్లును ఇరాక్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇరాక్‌లోని సంప్రదాయవాద షియా పార్టీలు పార్లమెంటులో వ్యక్తిగత చట్టానికి సవరణల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఇది 9 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ బిల్లుపై మహిళా హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
పూర్తిగా చదవండి..Marriage Act: అక్కడ ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లి.. మండిపడుతున్న హక్కుల సంఘాలు!
ఆడపిల్లలకు 9 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకువస్తోంది ఇరాక్. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ అక్కడ ఆడపిల్లల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఇరాక్ ఈ బిల్లుపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు.. ప్రజలు మండిపడుతున్నారు.
Translate this News: