Retail Inflation: ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.. కానీ.. 

రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరి నెలలో 5.10 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండగా.. ఫిబ్రవరిలో అది  5.09గా నమోదు అయింది. రిజర్వ్ బ్యాంక్ మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కాగా, దానికంటే చాలా ఎక్కువగా ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు అయింది. 

Retail Inflation: ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది.. కానీ.. 
New Update

Retail Inflation: రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో నెలవారీగా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రిటైల్ ద్రవ్యోల్బణం ముందు నెలలో అంటే 2024 జనవరిలో 5.10 శాతంగా ఉంది.  ఇది ఫిబ్రవరిలో 5.09 శాతానికి స్వల్పంగా తగ్గింది. అయితే, ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో పెరిగింది, జనవరితో పోలిస్తే ఇది 8.3 శాతం నుండి 8.66 శాతానికి పెరిగింది. ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం (Retail Inflation)రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కంటే ఎక్కువగా ఉంది.

ఫిబ్రవరిలో పట్టణ - గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం (Retail Inflation)రేటు గురించి చూసినట్లయితే, ఇది వరుసగా 8.30 శాతం, 8.66 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం జనవరిలో 27.03 ఉండేది. అది ఫిబ్రవరిలో 30.25 శాతానికి పెరిగింది. అయితే, జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో ఇంధనం- విద్యుత్ ద్రవ్యోల్బణం తగ్గింది.

ఐఐపీ గణాంకాల్లో మార్పు లేదు

దేశ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) జనవరిలో 3.8 శాతంగా నమోదవగా, అందులో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. మంగళవారం గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) డేటా నుండి ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది.

Also Read:పాసింజర్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. లెక్కలు ఇవే.. 

ద్రవ్యోల్బణంపై రిజర్వ్ బ్యాంక్ అంచనా

ఫిబ్రవరి 8 నాటి ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా ఆరోసారి రెపో రేటును 6.5 శాతం వద్ద ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ 2024 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం (Retail Inflation)అంచనాను యథాతథంగా 5.4 శాతం వద్ద ఉంచింది. మార్చి 31తో ముగిసే త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది.

#inflation #markets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe