Nafe Singh: హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, బహదూర్ గఢ్ మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ ను దుండగులు హత్య చేశారు. ఈ కాల్పుల్లో నఫే సింగ్ పాటు మరోపార్టీకి చెందిన కార్యకర్త కూడా మరణించారు. ఈ ఘటనలో తాను ప్రైవేట్ గా నియమించుకున్న గన్ మెన్స్ గాయపడ్డారు. నఫే సింగ్ తన వాహనంలో ఝజ్జర్ జిల్లాలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఐ10 కారులో వచ్చిన దుండగులు నఫే సింగ్ కారుపై కాల్పులు జరిపారు. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నఫే సింగ్ మరణించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. ఈ దాడి పక్కా ప్లాన్ తో జరిగినట్లు పోలీసులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతిభద్రతలకు పరిరక్షణ లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
ఇది కూడా చదవండి: ఆపరేషన్ వాలంటైన్ లో…ప్రధాని మోదీ పాత్రే హైలైట్ ?