మరో వివాదంలో టీటీడీ.. పాలకమండలిలో లిక్కర్ స్కాం నిందితుడికి చోటు మరో వివాదంలో టీటీడీ బోర్డు చిక్కుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి పాలక మండలిలో చోటు కల్పించింది. 24 మందితో ఉన్న ఈ లిస్ట్‌లో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైల్లో ఉండి బేయిల్‌పై బయటకు వచ్చిన శరత్ చంద్రా రెడ్డికి టీటీడీ చోటు కల్పించింది By Karthik 25 Aug 2023 in తిరుపతి రాజకీయాలు New Update షేర్ చేయండి మరో వివాదంలో టీటీడీ బోర్డు చిక్కుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడికి పాలక మండలిలో చోటు కల్పించింది. 24 మందితో ఉన్న ఈ లిస్ట్‌లో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి జైల్లో ఉండి బేయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు శరత్ చంద్రా రెడ్డికి టీటీడీలో చోటు కల్పించడంతో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శరత్ చంద్రారెడ్డి ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు కావడంతో టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించారని ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ ప్రకటించిన కొత్త పాలకమండలికి సంబంధించిన 24 మంది సభుల వివరాలు చూస్తే.. ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను (జగ్గయ్యపేట) పొన్నాడ సతీష్ (ముమ్మిడివరం) తిప్పేస్వామి (మడకశిర) మాసీమ బాబు (కడప) యానాదయ్య (కడప) వై. సీతారామిరెడ్డి (కర్నూలు, మంత్రాలయం) సుబ్బరాజు (ఉంగుటూరు) నాగ సత్యం యాదవ్ (ఏలూరు) శిద్ధా రాఘువరావు కుమారుడు సుధీర్ (ప్రకాశం) అశ్వథామ నాయక్ (అనంతపురం) డాక్టర్ శంకర్ (తమిళనాడు) కృష్ణమూర్తి (తమిళనాడు) దేశ్‌పాండే (కర్ణాటక) పెనక శరత్ చంద్రారెడ్డి (తెలంగాణ) ఎంపీ రంజిత్ కుమార్ సతీమణి సీతా రంజిత్ రెడ్డి (తెలంగాణ) అమోల్ కాలే (మహారాష్ట్ర) సౌరభ్ బోరా (మహారాష్ట్ర) మిలింద్ నర్వేకర్ (మహారాష్ట్ర) కేతన్ దేశాయ్ బోర సౌరభ్ మేకా శేషుబాబు రాంరెడ్డి సాముల బాలుసుబ్రమణియన్ పళనిస్వామి ఎస్ఆర్ విశ్వనాథరెడ్డి వీరి ఉన్నారు. #mp #vyasai-reddy #sarath-chandra-reddy #bhumana-karunakar-reddy #delhi-liquor-scam #accused #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి