Train Accident : రైలులో మంటలంటూ రుమార్స్‌..భయంతో పరుగులు..మరో రైలు ఢీకొట్టి!

ఝార్ఖండ్‌ లాతేహర్‌లో ససారాం- రాంచీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గట్టిగా అరవడంతో రైలులోని వారు కిందకి దిగి పరుగులు పెట్టారు. దీంతో పక్క ట్రాక్ లో వస్తున్న గూడ్స్ ఢీకొట్టి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
Train Accident : రైలులో మంటలంటూ రుమార్స్‌..భయంతో పరుగులు..మరో రైలు ఢీకొట్టి!

Train Accident : గుర్తు తెలియని ఆకతాయిలు చేసిన పని వల్ల కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఝార్ఖండ్‌ (Jharkhand) లాతేహర్‌ లో జరిగింది. ససారాం - రాంచీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ లో ఘోర ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగాయని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గట్టిగా అరవడంతో అందులో ఉన్న ప్రయాణికులు (Passengers) ప్రాణాలను రక్షించుకోవడానికి ట్రైన్‌ దిగి పరుగులు పెట్టారు.

రాంచీ- సాసారం ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మంటలు వ్యాపించాయంటూ విపరీతంగా వదంతులు రేగాయి. దీంతో కొందరు చైన్ లాగి ట్రైన్ ఆపేశారు. ఆ తర్వాత కుమండీహ్‌ రైల్వే స్టేషన్‌(Kumanidh Railway Station) సమీపంలో రైలు నుంచి కొందరు ప్రయాణికులు కిందకి దిగిపోయారు. పక్కనే ఉన్న మరో ట్రాక్​పై నిల్చున్నారు.

అదే సమయంలో అటుగా దూసుకొచ్చిన గూడ్స్‌ రైలు వారిని బలంగా ఢీకొంది. దీంతో ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు."రైలు చివరి బోగీలో ఉన్న కొందరు ప్రయాణికులు మంటలు చెలరేగుతున్నాయని గట్టిగా అరిచారు. అది విని ట్రైన్​ ఆపి కొందరు కిందకు దిగి చూడగా ఎలాంటి మంటలు లేవు. అదే సమయంలో వేగంగా వచ్చిన గూడ్స్ ఢీకొని కొందరు చనిపోయారు" అంటూ సునీల్‌ అనే ప్రయాణికుడు తెలిపాడు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులతోపాటు అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. వదంతులు వ్యాపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.

Also read: మూడు పెద్ద కాలింగ్ ఫీచర్లు..వాట్సాప్‌లో మరో అప్డేట్

Advertisment
Advertisment
తాజా కథనాలు