Imran Khan: మాజీ ప్రధాని అయినా సరే...జైల్లో కూలి పని చేయాల్సిందే..!!

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆయనకు పలు కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. మాజీ ప్రధాని కావడంతో జైల్లో హై ప్రొఫైల్ హోదా కల్పించారు. అయినా సరే..మాజీ ప్రధాని అయితేనేం..జైల్లో పనిచేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ వార్త కథనం ఒకటి వెల్లడించింది.

New Update
Pakistan: ఇమ్రాన్‌ ఖాన్ నిర్దోషి.. పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు!

Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆయనకు పలు కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. మాజీ ప్రధానికావడంతో ఇమ్రాన్ కు జైల్లో హై ప్రొఫైల్ హోదాను కల్పించారు. అయినప్పటికీ మాజీ ప్రధాని అయితేనేం జైల్లో పనిచేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ వార్త కథనం ఒకటి వెల్లడించింది. అధికారిక రహస్యపత్రాలు దుర్వినియోగం కేసులో ఇమ్రాన్, ఆయన సన్నిహితుడు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి షా మహమ్మద్ ఖురేషికి జైలు శిక్షపడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వారిద్దరూ రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న అడియాలా జైల్లో ఉన్నారు. వారికి హై ప్రొఫైల్ హోదా ఉండటంతో మిగతా ఖైదీల నుంచి విడిగా ఉంచనున్నారు. జైలు మ్యానువల్ ప్రకారం..వారికి రెండు జతల బట్టలు ఇచ్చారు. అయితే మిగతా కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ పై విచారణ జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆయన యూనిఫాం ధరించాల్సిన అవసరం లేదని జైలు వర్గాలు తెలిపాయి. కానీ వీరిద్దరూ జైలు ప్రాంగణంలో పనిచేయాల్సి ఉంటుందని రాతపూర్వక ఆదేశాలు కూడా ఉన్నాయి.

సంబంధిత వర్గాలు తెలిపిన వివరాలప్రకారం..మిగతా వారిలా హై ప్రొఫైల్ ఖైదీలను తోటపని, వంటపని, కర్మాగారాలు ఆసుపత్రుల్లో పనిచేయించరు. వారు మెయింటినెన్స్ విభాగంలో లేదంటే జైలు అధికారులు అప్పగించిన మిగిలిన పనులు చేయాల్సి ఉంటుంది. వారి హోదా ప్రకారం..వారి ఆహారాన్ని వారు తయారు చేసుకునే వెసులుబాటును కల్పించింది కోర్టు.

ఇది కూడా చదవండి: హిందూమతం స్వీకరించే ఇతర మతస్తుల కోసం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు..పూర్తి వివరాలివే..!!

ఇమ్రాన్ ఖాన్ తోపాటు ఆయన భార్య బుష్రా బీబీ కూడా జైల్లో ఉన్నారు. తోషఖానా కేసులో వీరిద్దరికీ 14ఏళ్ల శిక్షపడింది. నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి తాజాగా మరో 3ఏళ్ల జైలు శిక్షపడిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు