రామమందిరం గురించి ఈ విశేషాలు మీకు తెలుసా! అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశమంతా రామమయం అయ్యింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలివి. By Naren Kumar 22 Jan 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం రామమయమైంది. ఎక్కడ చూసినా రాముడే, ఎవరిని కదిలించినా రాముడే. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విశేషాలపై ఓ లుక్కేద్దాం. చీఫ్ ఆర్కిటెక్ట్‌లు - చంద్రకాంత్ సోంపురా, నిఖిల్ సోంపురా, ఆశిష్ సోంపురా. డిజైన్ సలహాదారులు - IIT గౌహతి, IIT చెన్నై, IIT బాంబే, NIT సూరత్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- రూర్కీ, నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్- హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్. నిర్మాణ సంస్థ - లార్సెన్ అండ్ టూబ్రో (L&T)ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ - టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ లిమిటెడ్ (TCEL) శిల్పులు - అరుణ్ యోగిరాజ్ (మైసూరు), గణేశ్ భట్, సత్యనారాయణ పాండే మొత్తం విస్తీర్ణం - 70 ఎకరాలు (70% ఆకుపచ్చ ప్రాంతం) ఆలయ విస్తీర్ణం - 2.77 ఎకరాలు ఆలయ కొలతలు - పొడవు - 380 అడుగులు, వెడల్పు - 250 అడుగులు, ఎత్తు - 161 అడుగులు. వాస్తుశిల్ప శైలి - భారతీయ నగరశైలి నిర్మాణ విశేషాలు - 3 అంతస్తులు, 392 స్తంభాలు, 44 తలుపులు ఆలయ సముదాయంలోని ముఖ్య మౌలిక సదుపాయాలు- 1. మురుగునీటి శుద్ధి కర్మాగారం 2. నీటి శుద్ధి కర్మాగారం 3. అగ్నిమాపక సేవ 4. ఇండిపెండెంట్ విద్యుత్ కేంద్రం. 5. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలను అందించడానికి 25వేల సామర్థ్యం గల యాత్రికుల సౌకర్య కేంద్రం. 6. స్నానపు ప్రదేశం, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్. 7. ఆలయ నిర్మాణంపై పిడుగు పడకుండా రక్షించడానికి 200 KA లైట్ అరెస్టర్‌లను ఏర్పాటు చేశారు. 8. రాముడు, రామాయణానికి సంబంధించిన కళాఖండాలను ప్రదర్శించే మ్యూజియం. ఇతర ఆకర్షణీయమైన విషయాలు: 1. ఒక టైమ్ క్యాప్సూల్ భూమి నుంచి సుమారు 2,000 అడుగుల దిగువన, ఆలయం కింద ఉంది. క్యాప్సూల్‌లో రామమందిరం, రాముడు, అయోధ్యకు సమాచారంతో రాగి ప్లేట్ ఉంది. ఆలయ గుర్తింపు కాలక్రమేణా చెక్కు చెదరకుండా ఉండేలా చూసుకోవడం ఈ టైమ్ క్యాప్సూల్ ఉద్దేశం. 2. ఈ ఆలయం భూకంపాలను తట్టుకుని నిలబడగలదు. 3. గండకీ నది (నేపాల్) నుండి తెచ్చిన 60 మిలియన్ సంవత్సరాల పురాతన శాలిగ్రామ శిలలతో విగ్రహాలను రూపొందించారు. 4. గంట అష్టధాతువు (బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, తగరం, ఇనుము మరియు పాదరసం)తో రూపొందించారు. గంట బరువు 2100 కిలోలు. శబ్దం 15 కిలోమీటర్ల దూరం వరకు వినబడుతుంది. #ayodhya-ram-mandir #ram-lalla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి