Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

వాలెంటైన్ వీక్ లో ప్రతీ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. అందులో మొదటి రోజును రోజ్ డే గా సెలెబ్రేట్ చేసుకుంటారు. అసలు రోజ్ డే రోజు ఎర్ర గులాబీలే ఎందుకు ఇస్తారు.? ఎర్ర గులాబీలు ఇవ్వడం వెనుక అర్థం.. వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?
New Update

Rose Day:  ప్రేమకు గుర్తుగా ఫిబ్రవరి 14ను ప్రేమికుల రోజుగా (Valentine's Day) సెలెబ్రేట్ చేసుకుంటారు. వాలెంటైన్ వీక్ (Valentine's Week) వచ్చిందంటే ప్రేమికులకు పండగే. ఈ వాలెంటైన్ వీక్ ప్రతీ రోజుకు ఒక స్పెషాలిటీ ఉంటుంది. రోజ్ డే (Rose Day), చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రపోజ్ డే, ప్రామిస్ డే, హాగ్ డే, కిస్ డే, వాలెంటైన్ డే ఇలా సెవెన్ డేస్.. డిఫరెంట్ థీమ్స్ తో గిఫ్ట్స్ ఇస్తూ ఒకరి పై ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. అందులో మొదటి రోజును రోజ్ డే గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఎర్ర గులాబీలను ప్రేమకు చిహ్నంగా చెబుతారు. తమ పార్ట్నర్ పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ఒక మార్గం. అసలు వాలెంటైన్స్ రోజున రెడ్ రోజెస్ మాత్రమే ఎందుకు ఇస్తారు. ఎర్ర గులాబీలు ఇవ్వడం వెనుక అర్థం.. వాటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..

ప్రేమకు గుర్తుగా

గులాబీలు (Rose Flowers) ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఇవి ప్రేమ, అభిరుచులతో దీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉంటాయి. వీటి అందం, సువాసన, సున్నితమైన స్వభావం ప్రేమను వ్యక్తపరుస్తాయి. ఇవి ప్రేమ, ఆప్యాయతను తెలియజేస్తాయి.

సాంస్కృతిక , పౌరాణిక మూలాలు

గ్రీకు పురాణాలలో, గులాబీలను ప్రేమ దేవత ఆఫ్రొడైట్‌తో సమానంగా పోలుస్తారు. రోమన్ సంస్కృతిలో ప్రేమ, అందాన్ని వీనస్ దేవతతో పోలుస్తారు. వీనస్ ప్రేమ, అందం, సామరస్యం, సౌందర్యానికి చిహ్నంగా సూచించబడుతుంది.

Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..!

publive-image

రంగు ప్రాముఖ్యత

వివిధ గులాబీలు వివిధ అర్థాలను కలిగి ఉంటాయి. వాలెంటైన్స్ రోజు ఎరుపు గులాబీలు ఇవ్వడానికి కారణం.. అవి ప్రేమ, ఇష్టం, అనుబంధాన్ని సూచిస్తాయి. అందుకే బాగా ప్రేమించే వారికి రెడ్ రోజెస్ తో ప్రేమను వ్యక్తపరుస్తారు. పసుపు గులాబీలు స్నేహానికి గుర్తుగా ఇస్తారు. పింక్ కలర్ రోజెస్ కృతజ్ఞత, ప్రశంశలను తెలిజేస్తాయి.

సాహిత్య,కళాత్మక ప్రభావం

గులాబీలు ఎదుటివారిలోని సాహిత్యం, కళను సూచిస్తాయి. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీలు ఒక మార్గం. మీ పార్ట్నర్ పై మీకున్న ప్రేమను ఇవి సింబాలిక్ గా సూచిస్తాయి. అందుకే ప్రేమను చెప్పేటప్పుడు ఎర్ర గులాబీలు ఇస్తారు.

సంప్రదాయం

సాధారణంగా పెళ్లిరోజు, ప్రేమికుల రోజు, ఏదైనా స్పెషల్ డేస్ లో ప్రేమించేవారికి గులాబీలు అందించడం ఎప్పటినుంచో ఒక పద్దతిగా మారింది. వాలెంటైన్స్ రోజున ఎర్ర గులాబీలే ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణం.

Also Read:  నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!

#valentines-day #rose-day #valen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe