Rains: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

Rains: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!
New Update

దేశంలో కొద్ది రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు(Rains)  పడుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ(Delhi)లో వర్షం పడుతుంది. అనేక రాష్ట్రాల్లో రుతుపవనాలు హుషారుగా కదులుతున్నాయి.

రానున్న రోజుల్లో కూడా రుతుపవనాలు ఇలాగే ఉంటాయని ఐఎండీ(IMD)తెలిపింది.ఢిల్లీ,యూపీ, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి.

గత వారం రోజుల నుంచి కూడా యూపీలో చాలా చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

ఇక రాజస్థాన్ లో కూడా రానున్న 24 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది.

#rains #imd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe