Rain Alert For AP: ఆంధ్ర ప్రదేశ్ కి భారీ వర్ష సూచన ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ(IMD). రాష్ట్రంలో శనివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అయితే రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణం కనిపిస్తోంది. శుక్రవారం పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఎండకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. మళ్లీ ఎండాకాల వచ్చిందనుకుంటున్నారు. కాగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం దేశంలోనే అత్యధికంగా తునిలో 38.5 డగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తంన ఆవరించింది. రానున్న 24 గంట్లలో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, అదే సమయంలో పగటి పూట ఎండతీవ్రత, ఉక్కపోత ఉంటుందని వెదర్ డిపార్ట్ మెంట్ అధికారులు అంటున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్.
ఇక శుక్రవారం.. గుంటూరు జిల్లా లాంలో 62.5 మిల్లీ మీటర్లు, బాపట్లలో 60 మిల్లీ మీటర్లు, అనకాపల్లిలో 40 మిల్లీ మీటర్లు, నెల్లూరు జిల్లా రాపూరులో 36 మిల్లీ మీటర్లు, ఏలూరు జిల్లా పోలవరంలో 28 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా కందుకూరులో 20 మిల్లీమీటర్లు, అన్నమయ్య జిల్లా చిన్నమండెంలో 74.8 మిల్లీ మీటర్లు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 43.8, కడప జిల్లా సింహాద్రిపురంలో 41.6, శ్రీ సత్యసాయి జిల్లా చెన్నెకొత్తపల్లెలో 36.8, అనంతపురం జిల్లా శింగనమలలో 35.2, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 35.2, కడప జిల్లా కోడూరులో 32.6, దువ్వూరు 32.2, రాజుపాలెంలో 31.6 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది.
Also Read: చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?