Weather ForeCast: రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే..!

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ ఎలా ఉండనుందో వాతావరణ కేంద్రం నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్‌ తో పాటు ఏపీలోని విజయవాడ, తిరుపతి, వైజాగ్‌ లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.

New Update
Telangana: నిప్పుల కొలిమిల తెలంగాణ ..ఇప్పటికే వడదెబ్బతో ఇద్దరు మృతి.. మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Weather ForeCast: హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం గురువారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందో నివేదికను  విడుదల చేసింది. తెలంగాణ రాజధాని నగరంలో 65 శాతం వర్షంపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు ఉండగా...కనిష్ఠ ఉష్ణోగ్రత 25 డిగ్రీలుగా ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.

publive-image

ఇక ఏపీలోని విజయవాడలో 40 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా ఉండగా..కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

publive-image

తిరుపతి లో 14 శాతం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలుగా ఉండగా... కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా ఉండనున్నాయి.

publive-image

విశాఖ పట్నంలో 88 శాతం వర్షం పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. 30 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రతలుగా ఉండగా.. 26 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలుగా ఉండనున్నట్లు అధికారులు వివరించారు.

publive-image

Also Read: 5 నెలల తరువాత కేసీఆర్‌ను కలవనున్న కవిత

Advertisment
తాజా కథనాలు