Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు

New Update
Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజుల నుంచి సూర్యుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్‌ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. గురువారం మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. రానున్న మూడు రోజుల పాటు వాతావరణశాఖ అధికారులు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

ఇదిలా ఉంటే ద్రోణి ఒకటి దక్షిణ విదర్భ నుంచి మరాఠ్వాడ, ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని ఐఎండీ పేర్కొంది. ద్రోణి మన్నార్ గల్ఫ్ నుండి అంతర్గత తమిళనాడు, రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతోందని వివరించింది. దీంతో మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2015, 2016 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆ సమయంలో అనేకమంది మృత్యువాత పడ్డారు. మళ్లీ ఇప్పుడు అంత తీవ్రమైన ఎండలు వేస్తూండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలెవరూ బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వస్తే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేట్‌ బారిన పడకుండా ఉండేందుకు పళ్లరసాలు, ఓఆర్ఎస్‌ ద్రావణాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also read: కొత్తిమీర నీటితో మధుమేహనికి చెక్‌ పెట్టొచ్చు..ఎలా తీసుకోవాలో తెలుసుకుందామా!

Advertisment
తాజా కథనాలు