Cohabitation: కామా తురాణం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్లు మూసుకుపోయినవారికి వావివరుసలుండవు. కామాంధులకు కఠిన శిక్షలు పడుతున్నా.. కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై దాడులకు, అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. వావి వరుసలు మరిచి క్రూరుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు కామాంధులు. తాజాగా హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. కూతురు వరసమ్యే అమ్మాయిపై ఓ ఉన్మాది అఘాయిత్యం చేశాడు. యువతికి సినిమాలపై ఉన్న ఆకర్షణను అలుసుగా తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు.
తల్లితో స్నేహం..
హైదరాబాద్ లోని మూసాపేటకు చెందిన ఓ మహిళకు ముగ్గురు ఆడ పిల్లలు. భర్త చాలా ఏళ్ల క్రితమే కన్నుమూశాడు. ఈ క్రమంలో ఎనిమిదేళ్ల క్రితం లింగంపల్లిలో ఉండే కృష్ణారావు అనే వ్యక్తి సదరు మహిళకు పరిచమయ్యాడు. అప్పట్నుంచి వారివురూ సహజీవనం చేయడం ప్రారంభించారు. అయితే కొంత కాలానికి ఇద్దరి మధ్య విబేధాలు రావటంతో గతకొద్ది రోజులుగా దూరంగా ఉంటున్నారు. మహిళ పెద్ద కుమార్తెకు సినిమాలంటే ఆసక్తి ఉంది. వెండితెరపై తనని చూసుకోవాలని ఆరాట పడుతూ ఉండేది. దానికోసం ప్రయత్నాలు చేస్తోంది.
ఇది కూడా చదవండి : Crime: పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసం.. లక్షల్లో దండుకున్న గుజరాత్ ముఠా
సినిమా ఛాన్స్ అంటూ కూతురును..
ఆమెకు నటనపై ఉన్న ఆసక్తిని ఆసరగా తీసుకున్న కృష్ణారావు.. వెబ్ సిరీస్‌లో మంచి వేషం ఉందంటూ నమ్మించాడు. మాయమాటలతో యూసఫ్‌గూడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. ఆనంతరం కూతురు వరసయ్యే అమ్మాయిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మోసపోయానని తెలుసుకున్న అమ్మాయి తన తల్లికి చెప్పగా, మధురానగర్ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.