Ileana D'Cruz: అప్పుడే రెండు నెలలు అయిపోయింది..ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా ఎమోషనల్ పోస్ట్..!

సినీ నటి ఇలియానా తన బాబును ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా..ప్రస్తుతం తన మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు.

Ileana D'Cruz: అప్పుడే రెండు నెలలు అయిపోయింది..ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలియానా ఎమోషనల్ పోస్ట్..!
New Update

Ileana D’Cruz shares her son Pic: ఇలియానా అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రీన్స్  మహేష్ బాబు (Mahesh Babu)  హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ (Pokiri) మూవీతో  స్టార్ హీరోయిన్ అయింది.

publive-image

అయితే, ఇటీవల తల్లి అయిన సినీ నటి ఇలియానా(Ileana D'Cruz) ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు. తాను గర్భవతినంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో వెల్లడించి అందరినీ షాక్ కు గురిచేసింది. రెండు నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా బాబును ఎత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అప్పుడే రెండు నెలలు అయిపోయిందని పేర్కొన్నారు.

తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచాడంటూ పలుమార్లు తన బాయ్‌ఫ్రెండ్ ఫొటోను షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా దాగుడుమూతలు ఆడిన ఇలియానా.. చాలా రోజుల తర్వాత అతడి ముఖాన్ని చూపిస్తూ ఫొటో షేర్ చేసి అభిమానులకు పరిచయం చేశారు. అతడి పేరును మైఖేల్ డోలాన్‌(Michael Dolan)గా పేర్కొంది. కాగా, ఆగస్టు 1న జన్మించిన బాబుకు కొయా ఫినిక్స్ డోలాన్ (Koa Phoenix Dolan) అని నామకరణం చేశారు.

publive-image

తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లారు. అయితే, అక్కడామెకు అనుకున్నంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం విద్యాబాలన్‌తో కలిసి ఆమె ఓ సినిమా చేస్తున్నారు.

publive-image

సెలబ్రిటీలంతా తమకు పుట్టిన కొడుకు లేదా కూతురు ఫోటోలను వెంటనే బయట పెట్టేందుకు పెద్దగా ఇష్టపడరు. కొద్ది రోజుల తర్వాత వారసుడు లేదా వారసురాలి ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇలియానా మాత్రం అలా చేయలేదు. బిడ్డ పుట్టిన నాలుగు రోజులకే వాడి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు పేరు కూడా బయట పెట్టేసింది. ఇప్పుడు మరోసారి తన కొడుకుతో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్  హ్యాపీగా ఫీలు అవుతున్నారు. సో క్యూట్ ఇలియానా అంత నీ అందమే వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ సెన్సేషన్ శివాజీకి అక్కడ 20 ఎకరాలు.. ఇంకా ఎంత ఆస్తి ఉందో తెలుసా?

#ileana-dcruz #ileana-dcruz-shares-her-son-pic #koa-phoenix-dolan #ileana-dcruz-son-photo #michael-dolan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe