Ilaiyaraaja : 'మంజుమ్మల్ బాయ్స్' నిర్మాణ సంస్థకి ఇళయరాజా నోటీసులు! 'గుణ' సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను మంజుమ్మల్ బాయ్స్ క్లైమాక్స్‌లో ఉపయోగించారు. దీనిపై ఇళయరాజా తన అనుమతి లేకుండా ఈ పాటను తమ సినిమాలో వాడుకున్నారని ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర నిర్మాణ సంస్థకు తన తరఫు న్యాయవాదితో లీగల్ నోటీసులు పంపారు. By Anil Kumar 23 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Ilaiyaraaja Send Legal Notice To 'Manjummel Boys' Movie Team : మలయాళ ఇండస్ట్రీలో రీసెంట్ గా రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న మంజుమ్మల్ బాయ్స్ మూవీ టీమ్ కి భారీ షాక్ తగిలింది. ఈ చిత్ర నిర్మాణ సంస్థకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. ఈ న్యూస్ కాస్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 'మంజుమ్మల్ బాయ్స్' యూనిట్ కి నోటీసులు మలయాళంలో ఓ యధార్థ సంఘటన ఆధారంగా వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys) చిత్రం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులోనూ రిలీజై మంచి కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమాలో అప్పట్లో ఇళయరాజా కంపోజ్ చేసిన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు. Also Read : బుజ్జిని తీసుకొచ్చిన భైరవ.. ప్రభాస్ కల్కి రచ్చ స్టార్ట్ అయిపోయింది.. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇళయరాజా తన అనుమతి లేకుండా ఈ పాటను తమ సినిమాలో వాడుకున్నారని ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర నిర్మాణ సంస్థకు తన తరఫు న్యాయవాదితో లీగల్ నోటీసులు పంపారు. సినిమాలో పాటను ఉపయోగించాలంటే కచ్చితంగా సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లేనని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఇంకా మూవీ టీమ్ స్పందించాల్సి ఉంది. #ilaiyaraaja #manjummel-boys మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి