IG Ranganath: మెదక్‌ ఘటనలో 9 మందిపై కేసు నమోదు

TG: మెదక్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించినట్లు ఐజీ రంగనాథ్‌ తెలిపారు.అందులో 9 మందిని అరెస్ట్ చేసి వారిపై మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

New Update
IG Ranganath: మెదక్‌ ఘటనలో 9 మందిపై కేసు నమోదు

Medak Issue: మెదక్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 45 మందిని గుర్తించినట్లు ఐజీ రంగనాథ్‌ తెలిపారు.అందులో 9 మందిని అరెస్ట్ చేసి వారిపై మూడు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని.. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

అసలేమైంది..

మెదక్ జిల్లాలో జంతువధకు సంబంధించి రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం..మరింత ముదిరి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం దాడిలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. దాడులకు సంబంధించి రెండు వర్గాలు..పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అల్లర్లలో పలు దుకాణాలను, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ బీజేపీ..పట్టణ బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. దీంతో ముందస్తుగా రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisment
తాజా కథనాలు