Pallipattis Benefits: మీ పిల్లలు చదువులో రాణించాలంటే పల్లీపట్టీలుఇవ్వండి

పల్లీలు, బెల్లంతో చేసిన వంటకమే పల్లిపట్టీలు. వీటిని తినడం వల్ల రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా పెద్దవారిలో కూడా అలసటను పోగొడుతాయి. గర్భిణులు, బాలింతలకు ఎంతో మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు.

New Update
Pallipattis Benefits: మీ పిల్లలు చదువులో రాణించాలంటే పల్లీపట్టీలుఇవ్వండి

Pallipattis Benefits: చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకు అందరూ పల్లి పట్టీలను ఇష్టంగా తింటుంటారు. ఈ పల్లి పట్టీలు ఎంతో సహజసిద్ధంగా బెల్లం, పల్లీలు వేసి తయారు చేస్తారు. మన శరీరానికి ఎన్నో పోషకాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు వీటిని తినడం వల్ల కలుగుతాయి. పల్లి పట్టీలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: నెల రోజులు ఈ నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో చూడండి

వీటిలో మనకు అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రొటీన్లు కూడా అధిక మొత్తంలో ఈ పల్లి పట్టీల్లో ఉంటాయి. దీంతో మన శరీరానికి ఎక్కువ శక్తి వస్తుంది. నిత్యం వ్యాయామాలు, అధిక శ్రమ చేసేవాళ్లు వీటిని తింటే శక్తితో పాటు ఉత్సాహం వస్తుంది. ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉంటారు. చిన్నారులకు పల్లి పట్టీలను ఇస్తే క్రీడలు, చదువుల్లో బాగా రాణిస్తారు. అంతేకాకుండా వారి మెదడు పనితీరు కూడా బాగా పెరుగుతుంది. ఎల్లప్పుడూ చురుగ్గా ఉండటంతో పాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతాయి. పల్లి పట్టీలో పాస్పరస్‌, నియాసిన్‌తో పాటు థయామిన్‌ అనే పోషకాలు ఎక్కువ శాతం ఉంటాయి.

కంటి చూపును మెరుగుపడుతుంది

ఎదిగే చిన్నారులకు ఈ పోషకాలు ఎంతో అవసరం. గర్భిణీ స్త్రీలు, బాలింతలు పల్లి పట్టీలను తింటే వారికి చాలా మంచిది. ఐరన్‌ బాగా అందుతుంది. దీంతో రక్తం కూడా పడుతుంది. రక్త హీనత సమస్యతో బాధపడేవారు వీటిని తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఈ పల్లి పట్టీల్లో ఉండే కాల్షియం మన ఎముకలను ధృడంగా మారుస్తుంది. ఇందులో ఉండే ఎ విటమిన్‌ మన కంటి చూపును మెరుగుపరిచి దృష్టిలోపాలు లేకుండా చేస్తుంది. ఇందులో ఉండే ఈ విటమిన్‌ మన గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను మన శరీరం నుంచి బయటికి పంపిస్తాయి. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. అందుకే రోజూ కనీసం ఒక పల్లి పట్టీని అయినా తినాలని వైద్యులు అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు