Breakfast: ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా..? జొన్న దోశలు ఆరోగ్యానికి ఎంతో మంచిది!

జొన్నలలో అధిక శాతం ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ ​లాంటి పోషకాలున్నాయి. జొన్నలతో బ్రేక్‌ ​ఫాస్ట్‌ ​తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతం అవుతుంది. ఇది ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి!

New Update
Breakfast: ఈ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడైనా ట్రై చేశారా..? జొన్న దోశలు ఆరోగ్యానికి ఎంతో మంచిది!

Breakfast: ప్రతీరోజూ అందరూ బ్రేక్‌ ఫాస్ట్‌లో రకరకాల టిఫిన్లు తింటారు. అయితే హెల్తీ బ్రేక్‌ ఫాస్ట్‌ గురించి చాలా మందికి తెలియదు. జొన్నలతో చేసిన పదార్థాలు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలుసా..? జొన్నలలో అధిక శాతం ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ ​వంటి పోషకాలున్నాయి. అంతేకాదు.. జొన్నలను తింటే ఎముకలు దృఢంగా, బలంగా ఉంటాయి. జొన్నలు మలబద్ధకాన్ని, డయాబెటిస్‌ వంటి సమస్యలను కంట్రోల్‌లో ఉంటాయి. జొన్నల వలన జీర్ణశక్తిని పెరుగుతుంది, గుండెకు మేలు, బ్లడ్ సర్కులేషన్‌కు తోడ్పడుతుంది. ఇలాంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న జొన్నలను వివిధ రకాలుగా చేసుకోని తింటారు. జొన్నలతో మీల్స్‌గా గడక, డిన్నర్‌గా జొన్న రొట్టే తింటున్నారా..? అయితే.. జొన్నలతో బ్రేక్‌ ​ఫాస్ట్‌ ​కూడా తాయరు చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంత అవుతుంది. ఈ జొన్న దోశలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు :

  • జొన్నలు
  • మినుములు
  • ​జీలకర్ర
  • వెల్లుల్లి రెబ్బలు
  • ఉప్పు

తయారీ విధానం :

ఒక గిన్నెలోకి జొన్నలు, మినుములు తీసుకుని నాలుగు సార్లు కడగాలి. వీటిపి 8 గంటలు నానబెట్టాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి వాటర్​ వేస్తూ మెత్తగా మిక్సీ చేయాలి. ఆ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని 8 గంటలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పాన్​ తీసుకొని దోశలు లా వేసుకోవాలి. దీన్ని పల్లీల చట్నీ‌తో సర్వ్​ చేసుకోవాలి. టేస్ట్​ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఉదయం హెల్దీ ఫుడ్ ​తింటే రోజంతా హుషారుగా ఉంటారు

ఇది కూడా చదవండి: వామ్మో.. వాము ఆకుతో అన్ని ప్రయోజనాలా..?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు