Health Tips : శరీరం నుంచి వేడిని తరిమికొట్టాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకుంటే సరి!

దోసకాయలో ఉండే శీతలీకరణ గుణాల గురించి అందరికీ తెలిసిందే. ఇది అధిక మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది, ఇది చర్మానికి మేలు చేయడమే కాకుండా సరైన జీర్ణక్రియను నర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

New Update
Health Tips : శరీరం నుంచి వేడిని తరిమికొట్టాలంటే.. ఆహారంలో వీటిని చేర్చుకుంటే సరి!

Summer : మార్చి నెల ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్‌ లో ప్రజలు తమ ఆహారం, తాగే వాటి మీద పూర్తి శ్రద్ద పెట్టాలి. ఈ సీజన్‌లో వేడిని నివారించడానికి, మన శరీరానికి చల్లదనాన్ని అందించే అటువంటి పండ్లను తినాలి. నిజానికి ఈ సీజన్‌లో వేడి నుంచి బయటపడేందుకు శీతల పానీయాలు(Cool Drinks), ఐస్‌క్రీమ్‌(Ice Creams) లు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని(Harmful To Health) కలుగుతుంది. మన శరీరానికి చల్లదనాన్ని అందించే పదార్థాలు ఏమేం తీసుకోవాలో చూద్దాం.

గుమ్మడికాయ: చాలా మంది గుమ్మడికాయను ఇష్టపడరు, కానీ కూరగాయలలో శరీరాన్ని చల్లబరిచే గుణం గుమ్మడి కాయకు ఉంది. ఇది మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రేగులలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఉల్లిపాయ: శరీరానికి చల్లదనాన్ని అందించే గుణాలు ఉల్లిపాయలో ఉన్నాయి. వంటగదిలో దొరికే ఉల్లిలో ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇది వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ఎర్ర ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అధికంగా ఉంటుంది, ఇది సహజమైన యాంటీ-అలెర్జెన్‌గా పని చేస్తుంది.

దోసకాయ: దోసకాయ(Cucumber) లో ఉండే శీతలీకరణ గుణాల గురించి అందరికీ తెలిసిందే. ఇది అధిక మొత్తంలో నీటిని కలిగి ఉంటుంది, ఇది చర్మానికి మేలు చేయడమే కాకుండా సరైన జీర్ణక్రియను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

పొట్లకాయ : పీచుపదార్థం పుష్కలంగా ఉండే పొట్లకాయ, నీరు సమృద్ధిగా లభించే చల్లని స్వభావం కలిగిన కూరగాయ. పొట్లకాయ పొట్టకు చాలా మేలు చేస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. కూరలే కాకుండా పొట్లకాయ తో రైతా కూడా తయారు చేసి తీసుకోవచ్చు.

పెరుగు: పెరుగు(Curd) ను రైతాగా చేసి లేదా మజ్జిగ చేసి తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉండే కూలింగ్ ఏజెంట్ వేసవి తాపానికి దూరంగా ఉంచుతుంది.

Also Read : వేసవి కాలంలో జీర్ణసమస్యలు వేధిస్తున్నాయా.. అయితే ఈ పండుతో చెక్‌ పెట్టేయ్యోచ్చు!

Advertisment
తాజా కథనాలు