Cinnamon And Lemon: దాల్చిన‌చెక్క, నిమ్మకాయ‌ను ఇలా తీసుకుంటే చాలు.. బ‌రువు మొత్తం త‌గ్గుతారు..!

మ‌న‌లో అధిక బ‌రువుతో ఇబ్బది పడుతున్నారు. అలాంటి వారు ఈ క‌షాయాన్ని తాగితే శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి, జీర్ణశ‌క్తి పెరిగి, ఇన్పెక్షన్‌లు, శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి.. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి.

New Update
Cinnamon And Lemon: దాల్చిన‌చెక్క, నిమ్మకాయ‌ను ఇలా తీసుకుంటే చాలు.. బ‌రువు మొత్తం త‌గ్గుతారు..!

Cinnamon And Lemon: చాలా మంది నేటి కాలంలో మ‌న‌లో అధిక బ‌రువుతో ఇబ్బది పడుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్ల వలన ఎన్నో ఆనారోగ్య స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్రధాన కారణం. అయితే.. మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో కొన్ని క‌షాయాన్ని త‌యారు చేసి తీసుకుంటే చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గవ‌చ్చు. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అంద‌రూ ఈ స‌మ‌స్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వ్యాయామం, జంక్ ఫుడ్, కూర్చొని ప‌ని చేయ‌డం, శ‌రీరానికి త‌గినంత శ్రమ లేక‌పోవ‌డం, నూనెలో వేయించిన ప‌దార్థాలు వంటి వివిధ కార‌ణాలతో ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. అయితే.. అధిక బ‌రువు స‌మ‌స్య నుంచి వీలైనంత త్వర‌గా బ‌య‌ట‌ప‌డాలంటే కొన్ని కషాయాలు తాగాలి. ఈ క‌షాయాన్ని త‌యారు చేయ‌డం సుల‌భం. బరువు త‌గ్గించే ఈ క‌షాయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

సుల‌భంగా బ‌రువు త‌గ్గాలనుంటే..

అధిక బ‌రువు సమ‌స్యతో ఇబ్బంది పడేవారు సుల‌భంగా బ‌రువు త‌గ్గాలనుంటే ఈ క‌షాయాన్ని త‌యారు చేసుకుని తీసుకోవాలి. ఈ క‌షాయాన్ని తాగటం వ‌లన బ‌రువు త‌గ్గడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కషాయం కోసం ఒక గిన్నెలో కొద్దిగా నీరు పోసి వేడి చేయాలి. ఇందులోనే 15 నుంచి 20 పుదీనా ఆకులు, 8 ల‌వంగాలు, దాల్చిన చెక్క ముక్క, అల్లం తురుము, 5 నిమ్మకాయ ముక్కలు వేసి బాగా మ‌రిగించాలి. ఈ నీటిని గ్లాస్ అయ్యే వ‌రకు మ‌రిగించిన త‌రువాత గోరు వెచ్చగా అయ్యేక ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తీసుకోవాలి.

Also Read: సీమ చింత‌కాయ‌ల నమిలి తినండి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి!

ఇలా రోజూ ఒక గ్లాస్ చొప్పున ఈ క‌షాయాన్ని తాగితే శ‌రీరంలో జీవ‌క్రియ‌ల రేటు పెరిగి.. బ‌రువు త‌గ్గవ‌చ్చు. పొట్టతో పాటు ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు అంతా సులభంగా క‌రిగిపోతుంది. అంతేకాదు ఈ క‌షాయాన్ని తాగితే శ‌రీరంలో రోగనిరోధ‌క శ‌క్తి, జీర్ణశ‌క్తి పెరిగి, ఇన్పెక్షన్‌లు, శ‌రీరంలో మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి.. ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్యలు త‌గ్గుతాయి. ఈ విధంగా చాలా సుల‌భంగా క‌షాయాన్ని ఇంట్లోనే తాయరు చేసుకుంటే బ‌రువు త‌గ్గడంతో పాటు ఆరోగ్యానికి మంచి క‌లుగుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ క‌షాయాన్ని రోజూ తాగితే మంచి ఫ‌లితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు