Fake Note: ఏటీఎం నుంచి నకిలీ నోటు వచ్చిందా? ఇలా చేయండి.. 

ఒక్కోసారి ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసినపుడు నకిలీ నోట్లు వచ్చే అవకాశం ఉంది. అటువంటపుడు మీరు ఆ నోటును బ్యాంకులో తిరిగి మార్చుకోవచ్చు. దాని కోసం ఏమి చేయాలో పూర్తిగా తెలుసుకోవడం కోసం హెడింగ్ పై క్లిక్ చేసి ఈ ఆర్టికల్ చూడండి. 

New Update
Fake Note: ఏటీఎం నుంచి నకిలీ నోటు వచ్చిందా? ఇలా చేయండి.. 

Fake Note: దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుండి, అందరూ  తమ నగదు లావాదేవీలను తగ్గించారు. అయితే, Paytm ఆన్‌లైన్‌లో అంగీకరించని కొన్ని చోట్ల మనం ATM నుంచి క్యాష్  విత్‌డ్రా చేయాల్సి ఉంటుంది. అటువంటపుడు.  ఏటీఎం నుంచి నకిలీ నోటు వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రస్తుతం దేశంలో రూ.30 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నగదు లేదా కరెన్సీలో జరుగుతున్నాయి. అటువంటపుడు, ATM నుంచి నకిలీ నోట్లు వచ్చెనందుకు అవకాశాలున్నాయి అనే  అనుమానం ఉంది. ఇది జరిగితే, మీరు వెంటనే కొన్ని పనులు చేయడం ద్వారా మీ డబ్బును తిరిగి పొందవచ్చు.

మీకు నకిలీ నోట్లు(Fake Note) దొరికితే వెంటనే ఈ పనులు చేయండి

  1. మీరు ATM నుంచి  డబ్బు విత్‌డ్రా చేస్తుంటే..  ఈ నోటు అసలైనది కాదని(Fake Note) మీకు కొంచెం అయినా అనిపిస్తే, ముందుగా దాని ఫోటో తీయండి.
  2. ఆ తర్వాత ఏటీఎంలో అమర్చిన సీసీటీవీ కెమెరా ముందు ఆ నోటును(Fake Note) తలకిందులుగా చూపించండి.  తద్వారా ఏటీఎం నుండే ఈ నోటు బయటకు వచ్చినట్లు కెమెరా రికార్డు చేస్తుంది.
  3. ఇప్పుడు ఈ లావాదేవీకి సంబంధించిన రసీదు తీసుకుని, దాని ఫోటో తీసి దాన్ని సేవ్ చేయండి.
  4. ఇప్పుడు ఏటీఎం నుంచి  నోటు(Fake Note), రసీదుతో బ్యాంకుకు వెళ్లండి. ఈ మొత్తం విషయం గురించి బ్యాంకు ఉద్యోగికి చెప్పండి. అప్పుడు మీకు ఒక ఫారమ్ ఇస్తారు. దాన్ని నింపిన తర్వాత నకిలీ నోటుతో పాటు రసీదు కూడా బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది.
  5. బ్యాంకు ఈ నకిలీ నోటు(Fake Note)ను తనిఖీ చేసి, ఆపై మీకు అసలు నోటును ఇస్తుంది.
  6. కానీ, మీరు పెద్ద మొత్తంలో డబ్బును విత్‌డ్రా చేసి, ఆపై మీకు నకిలీ నోటు(Fake Note) దొరికితే, మీరు ఈ నోటుతో RBIకి వెళ్లాలి. రసీదు, నోటు ఆర్‌బిఐకి ఇవ్వాలి. ఆ తర్వాత ఆర్‌బీఐ విచారణ జరుపుతుంది. ఆ తర్వాత మాత్రమే మీరు మీ డబ్బు తిరిగి పొందుతారు.

Also Read: లక్షద్వీప్ టూర్.. మార్చి వరకూ బుకింగ్స్ ఫుల్ బాస్!

అసలు, నకిలీ నోట్లను గుర్తించడం ఇలా

నకిలీ నోట్లను గుర్తించేందుకు ఆర్బీఐ కొన్ని పద్ధతులను ఇచ్చింది. మీరు అసలు 100 రూపాయల నోటును గుర్తించాలనుకుంటున్నారని అనుకుందాం, దాని ముందు వైపులా దేవనాగరి లిపిలో 100 అని రాసి ఉందా అనేది  చెక్ చేయండి. మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. అదేవిధంగా, ఇతర నోట్ల ముందు భాగంలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. టార్చ్ లేదా యూవీ లైట్‌లో చూస్తే పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ విధంగా మీరు నకిలీ, అసలైన నోట్లను గుర్తించవచ్చు.

Watch this iteresting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు