Personal Finance: రోజుకు రూ. 41 కట్టండి..వందేళ్లు ఆదాయం..ఈ కిర్రాక్ ప్లాన్ గురించి పూర్తివివరాలివే..!

మనదేశంలో ఎన్నో పాలసీలు ఉన్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలు బీమా పాలసీల ఆఫర్లను కల్పిస్తున్నాయి. మీరు 32ఏళ్ల వయస్సులో 30ఏళ్లపాటు పాలసీ తీసుకుంటే...63ఏళ్ల వయస్సు నుంచి ఆదాయం వస్తుంది. జీవన్ ఉమాంగ్ పాలసీలో చేరితే వందేళ్లవరకు జీవతకాల రిస్క్ కవరేజీ ఉంటుంది.

Money Tips: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్...మీరు అర్హులో కాదో తెలుసుకోండి..!
New Update

మనదేశంలో ప్రజలకు ఇన్సూరెన్స్ పాలసీలను మరింత చేరువ చేసిన కంపెనీ ఎల్ఐసీ(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈప్రభుత్వ రంగ బీమా సంస్థ పలు రకాల టర్మ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ కూడా చేస్తోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందే విధంగా వీటిని రూపొందించింది ఎల్ఐసీ. అయితే ఎల్ఐసీ పరిచయం చేసిన స్కీమ్స్ లో జీవన్ ఉమాంగ్ పాలసీ అనేది చాలా ప్రజాదరణ పొందింది. ఇది జీవిత కాల లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రీమియం చెల్లించే వ్యవధి ముగిసిన తర్వాత మెచ్యూరిటీ వరకు..ఈ ప్లాన్ సంవత్సరం పాటు సర్వైవల్ ప్రయోజనాలను అందిస్తుంది. మెచ్యూరిటీ తర్వాత లేదా పాలసీ వ్యవధిలో పాలసీదారులు చనిపోయిన సందర్బంగాలో ఒకేసారి మొత్తం పాలసీ అమౌంట్ చేతికి అందుతుంది. ఇలాంటి డ్యుయల్ బెనిఫిట్స్ తో జీవన్ ఉమాంగ్ ప్లాన్ పాలసీదారుల కుటుంబానికి ఆర్థిక భద్రత, రక్షణను అందిస్తుంది.

ఇక మరణాంతరం అందించే జీవన్ ఉమాంగ్ పాలసీలో, మెచ్యూరిటీ అమౌంట్ పై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. పాలసీ హోల్డర్స్ కు వందేళ్లు వచ్చే వరకు జీవితకాల రిస్క్ కవరేజీ ఉంటుంది. అలాగే 30ఏళ్ల వరకు ఆదాయానికి హామీ కూడా ఇస్తుంది.

పాలసీకి ఉండాల్సిన అర్హతలు ఇవే:
కనీసం 90రోజుల వయస్సున్న చిన్నారుల నుంచి గరిష్టంగా 55ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎల్ఐసీ జీవన్ ఉమాంగ్ పాలసీకి అర్హలు అవుతారు. ఇందులో పాలసీ టర్మ్ వందేళ్ల వరకు ఉంటుంది. కనీస హామీ మొత్తం రూ. 2లక్షలు. గరిష్ట హామీ మొత్తంపై ఎలాంటి పరిమితి ఉండదు. 15, 20,25,30ఏళ్లు ప్రీమియం పేయింగ్ టర్మ్ ను సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రీమియంను నెలవారీగా, త్రైమాసికంగా, అర్థవార్షికంగా లేదా యాన్యువల్ గా కట్టుకోవచ్చు. పాలసీ తీసుకున్న 3ఏళ్ల తర్వాత దీనిపై లోన్ కూడా తీసుకోవచ్చు. లేదంటే సరెండర్ చేయవచ్చు.

ప్రీమియం చెల్లించే వ్యవధి ముగిసిన తర్వత నుంచి, మెచ్యూరిటీ వరకు పాలసీదారులు యాన్యువల్ సర్వైవల్ ప్రయోజనాలు అందుకుంటారు. పాలసీదారుడు జీవించి ఉంటే..పాలసీ వ్యవధి ముగింపు నాటికి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఏకమొత్తంలో చేతికి అందుతుంది. పాలసీ వ్యవధిలో పాలసీదారులు మరణించినట్లయితే..నామినీ డెత్ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. దీన్ని ఏకమొత్తంగా కానీ లేదా రెగ్యులర్ ఇన్ స్టాల్ మెంట్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. ప్రమాద మరణం, డిసెబిలిటీ రైడర్ బెనిఫిట్, యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, న్యూటర్మ్ అస్యూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ ఇల్ నెస్ రైడర్,ప్రీమియం వేయర్ బెనిఫిట్స్, వంటి ఎన్నో ప్రయోజనాలను పాలసీదారులు అందుకుంటారు.

మీరు 32ఏళ్ల వయస్సులో 30ఏళ్ల పాలసీ తీసుకుంటే...62ఏళ్ల వయస్సు నుంచి ఆదాయం మీకు లభిస్తుంది. అయితే గుర్తుంచుకోవల్సిందంటే పాలసీదారుడు సరిగ్గా ప్రీమియం చెల్లించి ప్రీమియం పూర్తిగా చెల్లిస్తేనే ఆ తర్వాత సంవత్సరం నుంచి ఏడాది ఆదాయం పొందుతారు. మెచ్యూరిటీ ప్రయోజనం హామీ మొత్తం 8శాతం చొప్పున చెల్లిస్తారు.ఒక వ్యక్తి జీవన్ ఉమంగ్ పాలసీని రూ. 4.50లక్షల హామీతో కొనుగోలు చేసినట్లయితే 30ఏళ్ల పాలసీ కాలవ్యవధికి వార్షిక ప్రీమియం రూ. 14,770 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజూ సుమారు రూ. 41 చెల్లించాలి. పాలసీదారుడు వందేళ్ల వయస్సు వచ్చే వరకు 4.5 లక్షలతో 8శాతంగా రూ. 36,000 పొందుతారు.

ఇది కూడా చదవండి: కేవలం రూ. 56వేలకే కొత్త బైక్ మీ సొంతం..ఈ కిర్రాక్ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!!

#businessman #personal-finance
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి