అమెజాన్ లో 10వేలకే బెస్ట్ ఫీచర్ 5G స్మార్ట్ ఫోన్!

వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ ఇటీవల బడ్జెట్ ఫోన్ ఐక్యూ జెడ్9 లైట్ 5జీని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 10వేలకే బెస్ట్ ఫీచర్లతో అమెజాన్ లో దొరుకుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు కూడా లభిస్తున్నాయి.

New Update
అమెజాన్ లో 10వేలకే బెస్ట్ ఫీచర్ 5G స్మార్ట్ ఫోన్!

వివో అనుబంధ బ్రాండ్ ఐక్యూ ఇటీవల బడ్జెట్ ఫోన్ ఐక్యూ జెడ్9 లైట్ 5జీని లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ ప్రాసెసర్, అదనంగా 50 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా సెటప్ ఉన్నాయి. ఫీచర్ల పరంగా ఈ పరికరం మిగిలినవాటికంటే కంటే బాగుంటుంది. ప్రీమియం డిజైన్, ఫీచర్లను, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందిస్తున్న ఈ డివైజ్ బేస్ వేరియంట్ కేవలం రూ.10,499లకే అమెజాన్ లో దక్కనుంది.

ఈ ఫోన్ కోసం, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో చెల్లించినట్లయితే 10 శాతం అదనపు డిస్కౌంట్ అందుకుంటారు. ఆ తర్వాత ఫోన్ ధర రూ .10,000 కంటే తక్కువగా ఉంటుంది.పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విషయంలో మీరు గరిష్టంగా రూ .9,900 వరకు తగ్గింపు పొందవచ్చు. దాని విలువ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఆక్వా ఫ్లో, మోకా బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఐక్యూ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Advertisment
తాజా కథనాలు