Kitchen Tips: వంటగదిలో ఇలా చేస్తే చీమలు, పురుగులు పరార్‌

వంటగదిలో వస్తువులు, ఆహార పదార్థాలకి చీమలు పడుతున్నాయి. ఇలాంటి సమస్యలకు కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటితో ఈ సమస్యను దూరం చేయవచ్చు. ఇలా చేయడం వలన వంటింట్లోకి చీమలు పురుగులు రాకుండా ఉండాలంటే ఘాటు వాసన ఉన్న కొన్ని వస్తువలను అక్కడక్కడ పెట్టాలి.

Kitchen Tips: వంటగదిలో ఇలా చేస్తే చీమలు, పురుగులు పరార్‌
New Update

మనం వంటగదిలో అనేక రకాల ఆహార పదార్థాలను పెడతాము. వాటికి చీమలు పట్టకూండ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వంటగదిని ఎంత శుభ్రంగా ఉంచినా ఒక్కోసారి మనకు తెలియకుండానే దుర్వాసనతో పాటు ఆహార పదార్థాలకి చీమలు, పురుగులు పడుతుంటాయి. మన రోజువారీ జీవితంలో ఈ చిన్న చిన్న సమస్యలు మనల్నీ ఎంతో ఇబ్బంది పెడుతాయి. అందులో ముఖ్యంగా వంటగదిలో ఉండే ఫుడ్స్‌కి చీమలు, పురుగులు పట్టకూండ ఉండాలన్న.. ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చీమలు కీటకాల సమస్య తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: ఫైనల్స్‌లో అసలేం జరుగుతోంది.. వామ్మో ఇలా కూడా అవుతుందా?

బియ్యం, గోధుమ పిండి:

మన ఇళ్ళలో ఎక్కువగా బియ్యం, గోధుమ పిండి ఉంటుంది. వాటికి ఎక్కువగా పురుగులు పడుతాయి. అలాంటి పురుగు పట్టకుండా ఉండాలంటే దాల్చిన చెక్క మిరియాలు అందులో వేస్తే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు.

బేకింగ్ సోడా:

పప్పులు, బియ్యం వంటి గింజల్లో బేకింగ్ సోడా కలపొచ్చు. ఆ తర్వాత వాటిని చక్కగా వాష్ చేసుకోని వాడువాలి.

బిర్యానీ ఆకులు:

ప్రతీ ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి. నట్స్, పప్పులు, పల్సెస్, బియ్యంలో చీమలు, పురుగులు పట్టకుండా బిర్యానీ ఆకులు బాగా పని చేస్తాయి. వాటి ఘాటు వాసనకి చీమలు, పురుగులు పట్టకుంట ఉంచుతుంది.

వెనిగర్:

కీటకాలని దూరం చేయటంతో వెనిగర్ బెస్ట్‌గా పని చేస్తుంది. కాటన్ బాల్స్‌ని వెనిగర్‌లో ముంచి అక్కడక్కడ పెడితే ఆ ఘాటు వాసనకి చీమలు, కీటకాలు రాకుండా ఉంటాయి.

దాల్చిన చెక్క:

పంచదార డబ్బాలో దాల్చిన చెక్క వేస్తే చీమలు, పురుగులు పట్టకూండ ఉంటాయి. దీని వాసన కారణంగా చీమలు రావు.

తేనె:

తేనెకు కూడా చీమలు వస్తాయి. అలాంటప్పుడు అందులో లవంగాలు వేస్తే చీమలు అంతగా పట్టవు. అదేవిధంగా తేనె డబ్బా మూత చుట్టూ వాసెలిన్ రాసినా చీమలు పట్టవు.

ఉప్పు:

ఇంటి మూలల్లో చీమలు ఉంటే ఉప్పు వాటిని తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుంది. చీమలు ఉన్న ప్రదేశంలో ఉప్పు చల్లితే పారిపోతాయి. దానితో పాటు ఉప్పునీటిలో వేసి మరిగించి ఆ స్ప్రే బాటిల్‌తో చీమలు ఉన్న దగ్గర స్ప్రే చేయడం వల్ల చీమలు పోతాయి.

వంటగదిలో ఏదైనా తీపి ఉంచినా చీమలు పేరుకుపోతాయి. వీటితో పాటు సమయం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు సరుకుల్ని క్లీన్ చేసుకుంటే పురుగులు, చీమలు పటే అవకాశం ఉండదు. కాబట్టి కనీసం వారానికి ఒక్కసారి అయిన వీటిని క్లీన్ చేయడం మరువొద్దు. ఇలా కొన్ని సాధారణ ఈ టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో చీమలు, పురుగులు పట్టే సమస్యను దూరం చేసుకోవచ్చు.

#kitchen-tips #follow
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe