Lose Weight : పుచ్చకాయ తినండి బరువు తగ్గండి!

సమ్మర్ సీజన్లో శరీరానికి చలవ చేసే పండ్లలో ప్రధానంగా పుచ్చకాయ ఉంటుంది. పుచ్చకాయ శరీర ఉష్ణోగ్రత నే కాకుండా బరువు తగ్గటం కోసం కూడా ఉపయోగపడుతుంది. పుచ్చకాయను ఏ వేళలో తీసుకుంటే బరువు తగ్గుతారో చూసేయండి!

Lose Weight : పుచ్చకాయ తినండి బరువు తగ్గండి!
New Update

Summer Fruit : వేసవి(Summer) కాలం వచ్చేసింది. ఈ టైమ్‌లో చాలా పండ్లు వస్తుంటాయి. అందులో ఒకటి పుచ్చకాయ(Water Melon). వేసవి దాహాన్ని తీర్చడంలో ఈ కాయ ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. దీనిని తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. మన శరీరంలోని వేడి తగ్గి బాడీ హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుంది. అందుకోసం పుచ్చకాయని తింటారు చాలా మంది. అదే పుచ్చకాయ బరువు తగ్గించడంలోనూ ఎక్కువగా హెల్ప్ చేస్తుంది. అదెలానో చూద్దాం.

పుచ్చకాయని తింటే బరువు తగ్గుతారు. కాబట్టి, ఈ ఎండాకాలంలో ఎలాగూ వీటిని తినడానికి ఇష్టపడతారు. ఎక్కువగా వీటిని తీసుకుని మీరు అనుకునే బరువుని రీచ్ అవ్వండి. దీనిని తీసుకోవడం వల్ల బాడీలోని ట్యాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. దీనికోసం పుచ్చకాయని రెండు విధాలుగా తీసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం. మొదట్లో 3 రోజులు 3 పూటలా పుచ్చకాయని మాత్రమే తీసుకోండి. మధ్యమధ్యలో నీరు తాగొచ్చు. ఇతర ఘన పదార్థాలు తీసుకోకూడదు. ఓట్స్(Oats), లస్సీ(Lassi), ఇతర పదార్థాలతో పుచ్చకాయని కలిపి తీసుకోవచ్చు.

భోజనానికి ముందు 2 నుంచి 3 పెద్ద పుచ్చకాయ ముక్కల్ని ఆహారంగా తీసుకోండి. మధ్యాహ్న భోజనంలో సలాడ్, ఉడికించిన చేప, చికెన్ తినండి. డిన్నర్‌లో పుచ్చకాయని మాత్రమే తీసుకోండి.ఎక్కువ రోజులు ఈ డైట్ ఫాలో అవ్వకూడదు. ఓ వారం వరకూ ఫాలో అవ్వొచ్చు. అయితే, బరువు తగ్గాలనుకుంటే(Weight Loss) ఈ మెథడ్ ఫాలో అవ్వొచ్చు. అదేంటంటే..బ్రేక్‌ఫాస్ట్‌లో హోల్ గ్రెయిన్ బ్రెడ్ టోస్ట్ 1, ఓ కప్పు పుచ్చకాయ
టీ టైమ్‌లో బ్లాక్ కాఫీ ,లంచ్‌లో ఉడికించిన చికెన్ లేదా చేప ముక్కలు, 1 హోల్ వీట్ బ్రెడ్, ఓ కప్పు పుచ్చకాయ,రాత్రి డిన్నర్‌లో 100 గ్రాముల ఉడికించిన కూరగాయలు, 100 గ్రాముల చికెన్ లేదా చేప ముక్కలు, ఓ కప్పు పుచ్చకాయ తీసుకోండి.గర్భిణీలు ఈ డైట్ చేయొద్దు,అదే విధంగా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు,ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు..అలాగే పిల్లలు ఇలాంటి డైట్ ఫాలో అవ్వొద్దు.

#lose-weight #water-melon #summer-fruits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe