HealthTips: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. బీరకాయ.. నేతి బీరకాయతో అద్భుత లాభాలు

మనం ఎక్కువగా తినే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. వీటిని ఎక్కువగా బాలింతలకు, పాలిచ్చే తల్లులు బీరకాయలు పెట్టాలని డాక్టర్లు అంటారు. బీరకాయ, నేతి బీరకాయ రెండు రకాల కాయల్లోనూ ఉండే పోషకాలు రోగనిరోధకశక్తిని పెంపొందిచడంతోపాటు కంటికండరాల బలహీనత తగ్గుతుంది.

New Update
HealthTips: షుగర్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. బీరకాయ.. నేతి బీరకాయతో అద్భుత లాభాలు

Health Tips: మనం రోజూ ఆహారంగా తినే కూరగాయల్లో బీరకాయలు ఒకటి. వీటిని ఎక్కువగా బాలింతలకు, పాలిచ్చే తల్లులు బీరకాయలు పెట్టాలని డాక్టర్లు అంటారు. బీరకాయలతో కూర, పచ్చడి, పప్పు ఇలా రకరకాల వంటకాలను చేసుకుని తింటారు. మధ్యతరగతి ఇళ్లలో బీరకాయ కర్రీలో పాలు పోసి సింపుల్‍గా చేసుకుంటారు. అయితే.. జ్వరం వచ్చి తగ్గినప్పుడు పథ్యం కూరలా బీరకాయ వండుతారు. బీరకాయలో నీరు, పీచుపదార్థం ఎక్కువ, కొవ్వులు తక్కువగా, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తింటే తొందరగా జీర్ణం అవుతాయి. బీరకాయను పథ్యం కూరలా, ఆహారంలో తరచుగా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే.. బీరపాదులో ఎక్కువ ఔషధపూరితం అని వైద్యులు చెబుతున్నారు. పథ్యంలా తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బీరకాయ, నేతి బీరకాయ వల్ల కలిగే ఆరోగ్య లాభాలు

  • సాధారణ బీరకాయ,నేతి బీరకాయ రెండు రకాల కాయల్లోనూ విటమిన్‌-సి, పీచు, జింక్, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. సెల్యులోజ్‌ అధికంగా ఉండటంతో ఇది మలబద్ధకాన్,నీ మొలలవ్యాధినీ తగ్గిస్తుంది. బీరకాయల్లోని పెప్టెడ్‌లు, ఆల్కలాయిడ్‌లు రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ ఉపయోగపడుతుంది.
  • బీరకాయలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ దరి చేరవని.. రోగనిరోధకశక్తిని పెంపొందిచడంతోపాటు కంటికండరాల బలహీనత తగ్గిస్తుందనీ తేలింది. అల్సర్లూ మంటలతో బాధపడేవాళ్లకి బీరకాయ చక్కటి మందులా పనిచేస్తోంది.
  • షుగర్‌ ఉన్నవాళ్లకు బీరకాయ మంచి మెడిసిన్. బీరకాయ తినటం వలన మాంగనీసు జీర్ణక్రియా ఎంజైముల ఉత్పత్తిపెరుగుతుంది. దీంతో చక్కెరవ్యాధినీ నియంత్రించి, రక్తశుద్ధికీ, కాలేయ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. బీరకాయ దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది.
  • రక్త హీనతతో బాధపడుతున్న వారికి బీరకాయలు చాలా బాగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌- బి5 చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బీరకాయల్లోని విటమిన్‌ బి6 అనీమియాను నివారించగలదనీ అంటున్నారు. ఎన్నో ప్రయోజనాలున్న బీరకాయను పథ్యంలాను ప్రతీరోజూ తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు అంటున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: పిగ్మెంటేషన్‌కు చక్కటి ఔషధం కుంకుమపువ్వు.. చర్మ కాంతి రెట్టింపు

Advertisment
Advertisment
తాజా కథనాలు