If you drink These teas during monsoons immunity will increase: వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్ లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అంటు వ్యాధులు తొందరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనపై ఎఫెక్ట్ చూపకుండానే ఇమ్యునిటీని పెంచుకోవాలి. చిన్నారుల్లోనూ, పెద్దవారిలోనూ ఫ్లూ, దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్స్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నివారించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే. ఈ సీజనల్ వ్యాధుల నుంచి బయట పడేందుకు మనం ఇంట్లోనే ఈజీగా కొన్ని కషాయాలు, టీలు చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా.
1. తులసి టీ: వర్షాకాలం, చలికాలాల్లో ఈ టీ తాగితే సీజనల్ ఇన్ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది. దగ్గు, జ్వరం నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఇది ఎలా చేయాలంటే.. ఓ పాత్రలో నీరు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత తులసి ఆకులు వేసి గ్లాసుడు నీళ్లు సగం అయ్యేవరకూ మరిగించాక చల్లార్చాలి. తాగడానికి కావాల్సినంత గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, కాస్త తేనె వేసి తాగాలి.
2. మాన్ సూన్ టీ: ఈ టీ మన బాడీకి యాంటీ బ్యాక్టీరియాగా పని చేస్తుంది. అలాగే ఇమ్యునిటీని కూడా పెంచుతుంది. వాత, పిత్త, కఫాలను బ్యాలెన్స్ చేస్తుంది. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక గిన్నెలో నీరు పోసి బాగా మరిగించాలి. ఇందులో ధనియాలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని.. మరికొంత సమయం మరిగించాక దించి, గోరువెచ్చగా అయ్యాక అందులో తేనె కలిపి ఆస్వాదించాలి.
3. లైకోరైస్ (అతిమధురం) టీ: రెయినీ సీజన్ లో ముఖ్యంగా ఈ లైకోరైస్ టీని తాగడం వల్ల చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గొంతునొప్పి దూరమవ్వడమే కాకుండా.. అంటువ్యాధులు రాకుండా.. ఇమ్యూనిటీని పెంచుతుంది.
ఈ లైకోరైస్ టీని ఎలా చేయాలంటే.. ఓ గిన్నెలోని నీరు పోసి బాగా మరుగుతున్నప్పుడు.. అతిమధురం పొడి వేసి మరికాసేపు మరిగించాలి. మూడు కప్పుల నీరు కాస్తా.. సగమయ్యే వరకూ మరగాలి. ఆ తర్వాత కాస్త చల్లారాక.. తేనె వేసుకుని తాగడమే.