Okra Water: బెండకాయ నీటిని తాగితే ఇన్ని ఉపయోగాలా?

అనేక రకాల కూరగాయలు సీజన్‌తో సంబంధం లేకుండా బెండకాయ దొరుకుతుంది. కేవలం వంటకే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా బెండకాయ వల్ల కలుగుతాయి. ఈ బెండకాయ నీటిని తాగితే కడుపు శుభ్రం, పేగులు, జీర్ణాశయంలో ఉండే చెత్తాచెదారం బయటకు వెళ్లిపోతుంది.

New Update
Okra Water: బెండకాయ నీటిని తాగితే ఇన్ని ఉపయోగాలా?

Okra Water Benefits: మనం అనేక రకాల కూరగాయలతో వంటలు చేసుకుని తింటుటాం. అందులో బెండకాయ ఒకటి. సీజన్‌తో సంబంధం లేకుండా ఏ సీజన్లో అయినా ఇది మనకు దొరుకుతుంది. బెండకాయతో అధికంగా వేపుడు, పులుసు కూరలు చేసుకుంటారు. ఎలా వండినా బెండ రుచి అద్భుతంగా ఉంటుంది. కేవలం వంటకే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈ బెండకాయ వల్ల కలుగుతాయి. అసలు బెండ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

బెండకాయ నీరు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

రెండు బెండకాయలను తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి వాటి మొదలు, చివరి భాగాలను కట్ చేసి తర్వాత ఒక్కో బెండకాయను నిలువునా కట్ చేసుకోవాలి. చివరి భాగంలో ఒక చిన్న ఘాటు పెట్టాలి. అలా చేసుకున్న తర్వాత ఒక గ్లాసు నీరు తీసుకొని ఆ బెండకాయలను అందులో వేయాలి. దానిపై తర్వాత మూత పెట్టాలి. అలా రాత్రంతా ఆ నీటిని ఉంచిన తర్వాత ఉదయాన్నే అందులో నుంచి బెండకాయలను తీసేసి పరగడుపున తాగేయాలి. ఇలా చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ బెండకాయ నీటిని తాగితే మన కడుపు శుభ్రం అవుతుంది. పేగులు, జీర్ణాశయంలో ఉండే చెత్తాచెదారం బయటకు వెళ్లిపోతాయి. కడుపులో ఏదైనా అల్సర్లు ఉన్నట్లయితే అవి తగ్గిపోతాయి. అంతేకాకుండా గ్యాస్, యాసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గిపోతాయి. బెండకాయల్లో విటమిన్ ఈ, సి, కె, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో మన శరీరానికి చక్కటి పోషణ అందుతుంది.

ఇది కూడా చదవండి: ఉత్తరేణితో వందల రోగాలు మాయం..సంజీవనిలాంటి మొక్క

అంతేకాకుండా రక్త సరఫరా కూడా మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి బెండకాయ ఎంతో బాగా పనిచేస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. షుగర్‌ని కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. మన రక్తంలోని షుగర్ స్థాయిలు పూర్తిగా కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా ఎముకలు బలంగా మారుతాయి. స్త్రీలకు రుతు సమయంలో ఉండే ఇబ్బందులు తగ్గిపోతాయి. శరీరంలో ఎక్కువగా వేడి ఉన్నవారు ఇలా బెండకాయ నీటిని తాగడం వల్ల శరీరం సాధారణ స్థితికి వస్తుంది. బెండకాయల నీళ్లు తాగితే అధిక కొవ్వు కూడా కరిగిపోతుంది. దీంతో మనం శరీర బరువు తొందరగా తగ్గవచ్చు. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది. జుట్టుకు కూడా ఈ బెండకాయ నీళ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మన జుట్టు దృఢంగా, బలంగా పెరుగుతుంది. అంతే కాకుండా రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగవుతుంది. కంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. రోజూ బెండకాయ నీళ్లు తాగితే మన శరీరంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.

Advertisment
తాజా కథనాలు